Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jul-2017 11:56:30
facebook Twitter Googleplus
Photo

ఆరంభోత్సవం ఓకే అనిపించినా.. ఎన్టీఆర్ ఆ వేడుకను బాగానే లాగించేసినా.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అసలు వ్యవహారం మాత్రం అంతగా జనాల్ని ఆకర్షించలేదు. అసలే ప్రేక్షకుల అంచనాలకు తగ్గ పార్టిసిపెంట్లు లేకపోగా.. వాళ్ల మీద చిత్రీకరించిన ఎపిసోడ్లు కూడా అంతంతమాత్రంగా తయారయ్యాయి. ఇంగ్లిష్.. హిందీ ‘బిగ్ బాస్’ తరహాలో ఇక్కడ పెద్ద స్థాయి వివాదాలేమీ చోటు చేసుకోలేదు. డ్రామా పండించడానికి చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. దీంతో వీక్ డేస్ లో బిగ్ బాస్ వీక్ గా కనిపించింది. కొంచెం కష్టంగానే నడిచాయి ఎపిసోడ్లు.

ఐతే వారాంతంలో ఎన్టీఆర్ వచ్చి మళ్లీ బిగ్ బాస్ ను ట్రాక్ లోకి తెచ్చాడు. నిన్న రాత్రి బిగ్ బాస్ లోకి ఎన్టీఆర్ రీఎంట్రీ అదిరింది. తొలి రోజు ప్రారంభోత్సవంలో నెర్వస్ నెస్ వల్లో సరైన ప్రిపరేషన్ లేకపోవడం వల్లో.. ఎన్టీఆర్ కొంచెం ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. అతడి అత్యుత్సాహం కూడా ప్రేక్షకుల్ని కొంచెం ఇబ్బంది పెట్టింది. కానీ శనివారం మాత్రం ఎన్టీఆర్ పూర్తిగా సంతృప్తిపరిచాడు. తనదైన ఎనర్జీ.. వాక్చాతుర్యం చూపిస్తూ.. ఎక్కడా అతి లేకుండా.. బ్యాలెన్స్డ్ గా షోను నడిపించాడు ఎన్టీఆర్. పార్టిసిపెంట్లతో అతడి సంభాషణ ఆకట్టుకుంది. దీనికి తోడు ఎలిమినేషన్ ప్రాసెస్ కీలక దశకు చేరుకుని.. ముగ్గురి పేర్లను షార్ట్ లిస్ట్ చేయడం జనాల్లో ఆసక్తి రేకెత్తించింది. జ్యోతి.. మహేష్ కత్తి.. హరితేజలను ఎలిమినేషన్ తుది జాబితాలో చేర్చారు. వీరిపై ఆడియన్స్ ఓటింగ్ ను బట్టి.. మిగతా అంశాల్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఆదివారం షో నుంచి మొదటగా బయటికి వెళ్లే వ్యక్తి ఎవరో ప్రకటించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో ఎన్టీఆర్ ప్రకటించబోతున్నాడు. తర్వాత ఆ వ్యక్తితో సంభాషణ కూడా ఉంటుంది.

,  ,  ,  ,  ,