Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2016 16:35:03
facebook Twitter Googleplus
Photo

అఆ విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికాలో. కనీ వినీ ఎరుగని రీతిలో అక్కడ సినిమాకి వసూళ్లు లభిస్తున్నాయి. శనివారం ఒక్క రోజే హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లని కొల్లగొట్టింది. ఒక స్టార్ కథానాయకుడి సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా ఆ వసూళ్లు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు లెక్కలుగడుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే సినిమా అలవోకగా 2 మిలియన్ డాలర్ల మార్కును చేరుకొనేలా ఉందని అంటున్నారు. మరికొద్దిమంది శ్రీమంతుడు రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. ఆ మాట చెప్పడానికి బలమైన కారణం కూడా ఉంది.

ప్రస్తుతం అమెరికాలో సమ్మర్ హాలీడేస్. ఆఫీసులేమీ ఉండవు కాబట్టి కాలక్షేపం కోసం జనాలు తప్పకుండా సినిమాని ఆశ్రయిస్తారు. అయితే తెలుగు నుంచి అఆ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఆ సినిమాకి వసూళ్ల వరద ఖాయం అంటున్నారు. అమెరికాలో తెలుగు సినిమా మిలియన్ మార్క్ చేరుకోవడం ఇది 20వ సారట. సమంత నటించిన సినిమాలే దాదాపు పది వరకు మిలియన్ డాలర్లు వసూలు చేసుకొన్నాయని లెక్కగడుతున్నారు. శనివారంతోనే అఆ మిలియన్ మార్క్ చేరుకొంది కాబట్టి మరో వీకెండ్లోపు మరో మిలియన్ ఖాయమనేది ట్రేడ్ వర్గాలు చెప్పే మాట. సినిమాకి పాజిటివ్ టాక్ ఉండటం అది కూడా కుటుంబ కథ కావడం మూలాన ఫ్యామిలీస్ అంతా కూడా థియేటర్లకి వెళతారు. మొత్తంగా నితిన్ కెరీర్లో ఓ మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోతుంది. ఆయన తదుపరి చేసే సినిమాలకి బడ్జెట్లు పెంచుకొనే వెసులుబాటుని అఆ ఇచ్చినట్టైంది.

,  ,  ,  ,  ,