Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2017 11:18:01
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెట్టిన అర్చన ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడానికి అన్ని రకాల పాత్రలు చేసింది. ఆర్ట్ సినిమా హీరోయిన్ నుంచి కమర్షియల్ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ వరకు... హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి ఐటం సాంగుల వరకు అన్ని ప్రయత్నాలు చేసింది. అవకాశాలైతే అలా వస్తూనే ఉన్నాయి కానీ అర్చన ఆశించిన బ్రేక్ మాత్రం ఆమెకు దక్కలేదు.

తెలుగు టెలివిజన్ లో మొదటి రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ప్రోగ్రాం ఎట్టకేలకు అర్చనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రాం చేసిన లేడీ కంటెస్టెంట్లలో మొదటి నుంచి చివరి వరకు కొనసాగిన వారిలో అర్చన కూడా ఉంది. దీంతో టీవీ ప్రేక్షకుల్లో ఆమెకు మంచి గుర్తింపే వచ్చింది. బిగ్ బాస్ లో పాల్గొన్న పాపులారిటీ ఇప్పుడామెకు బాగానే పనికొస్తోంది. సెలబ్రిటీలతో షాప్ ఓపెనింగు చేయించి కస్టమర్లను ఆకట్టుకోవడం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. బిగ్ బాస్ తర్వాత రిబ్బన్ కటింగ్ ఆఫర్లు అర్చనకు బాగానే వస్తున్నాయి. రిబ్బన్ కటింగ్ కు అర్చన తీసుకునే మొత్తం కూడా హీరోయిన్లతో పోలిస్తే తక్కువే కావడంతో వ్యాపారులు ఆమెను ఎంచుకుంటున్నారు.

ముందు వేద పేరుతో ఇండస్ట్రీలోకి వచ్చింది అర్చన. సరైన గుర్తింపు రాకపోవడంతో తర్వాత గా పేరు మార్చుకుని ఇండస్ట్రీలో కొనసాగింది. పేరు మార్చుకున్నా ఫేటు మాత్రం మారలేదు.

,  ,  ,  ,