Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jan-2017 10:11:10
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో చాలా ప్రయత్నాల తర్వాత క్షణం మూవీతో గుర్తింపు సంపాదించుకుంది ఆదా శర్మ. ఆ మూవీలో అమ్మడి పెర్ఫామెన్స్ సూపర్బ్ గా ఉండడంతో ఇతర ఇండస్ట్రీలను బాగానే ఆకర్షించింది. తమిళియన్ అయినా.. పుట్టింది పెరిగింది అంతా ముంబై కావడంతో హిందీ.. ఇంగ్లీష్ కూడా బాగా మేనేజ్ చేసేస్తానంటోంది.

ప్రస్తుతం విద్యుత్ జమాల్ తో కలిసి కమాండో 2 అనే మూవీలో నటిస్తోంది ఆదా శర్మ. ఈ సినిమాలో ఆదా పాత్ర పేరు భావనా రెడ్డి 'నేను ఇప్పటివరకూ సౌత్ లో చేసినవన్నీ చాలా సీరయస్ రోల్స్. కానీ మొదటిసారిగా కమాండో2లో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేస్తున్నా. ప్రతీ విషయాన్ని సింపుల్ గా తీసుకునే ఈ పాత్ర.. సూపర్బ్ గా కామెడీ పండిస్తుంది. అయితే.. ఈ మూవీలో నా పెర్ఫామెన్స్ ను విద్యుత్ తో పోల్చదలచుకోలేదు. మేమంతా ఓ టీంగా పని చేయబట్టే ఇంత అద్భుతంగా చేయగలిగాం' అని చెబుతోంది ఆదా శర్మ.

'నేను హిందీ ఇంగ్లీష్ తమిళ్ మాట్లాడగలను. నాకు భాషా పరమైన అడ్డంకులు ముందు నుంచే లేకుండా పోయాయి. నాకు తగ్గ పాత్ర అనుకుంటే చేసేస్తానంతే. స్క్రిప్ట్ బాగుండాలి.. ఇంతకు ముందు నేను చేసిన రోల్ మాదిరిగా ఉండకూడదు. నాకు నేను విధించుకున్న కండిషన్స్ ఇంతే' అని చెబుతోంది ఆదాశర్మ. దేవేన్ భోజని దర్శకత్వంలో రూపొందిన కమాండో2 మార్చ్ 3న విడుదల కాబోతోంది.

,  ,  ,  ,