Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2016 12:00:00
facebook Twitter Googleplus
Photo

హార్ట్ ఎటాక్ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఆదా శర్మ.. కెరీర్ ని పరుగులు పెట్టించడానికి వరుసగా సినిమాలు ఒప్పేసుకుని తల బొప్పి కట్టించుకుంది. సన్నాఫ్ సత్యమూర్తి సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలు హిట్ అయినా.. ఆదాశర్మకు మాత్రం ఏ మాత్రం ఉపయోగపడలేదు. కానీ ఈ ఏడాది విడుదలైన క్షణం మూవీ అమ్మడి కెరీర్ కి ఫుల్ టర్నింగ్ ఇచ్చేసింది. ఇప్పుడు బాలీవుడ్ క్షణంలో సల్మాన్ పక్కన నటించేందుకు కూడా ఆదా శర్మనే అనుకుంటున్నారంటే.. ఈ భామ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.

మే 10 వ తారీఖు ఆదాశర్మ పుట్టిన రోజు. అదే రోజున మరో విశేషం చోటు చేసుకుంది. 2013లో విడుదలైన కమాండో చిత్రానికి సీక్వెల్ గా కమాండో 2 షూటింగ్ ప్రారంభించింది యూనిట్. తన పుట్టిన రోజునే కొత్త సినిమా షూటింగ్ మొదలవడంతో.. తెగ హ్యాపీ అయిపోయిన ఆదా.. ఆ సంగతిని అభిమానులతో పంచుకుంది. 'పుట్టిన రోజునే కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనడం గిఫ్ట్ గా భావిస్తున్నా. నిజంగానే నిన్న నాకు వెరీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే' అంటూ ట్వీట్ చేసింది ఆదాశర్మ.

కమాండో-2లో ఆదా కేరక్టర్ చాలా క్లిష్టమైనది అంటున్నారు. ఆ రోల్ ను చేసేందుకు కొన్ని నెలలపాటు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంది ఆదా. విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్న ఈ సీక్వెల్ మూవీపై.. బాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.

,  ,  ,  ,  ,  ,