Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Nov-2016 15:21:13
facebook Twitter Googleplus
Photo

ఒక మనీషా కొయిరాలా.. ఒక ఐశ్వర్యారాయ్.. ఒక నిత్యా మీనన్.. ఇలా ఎంతెంతమంది హీరోయిన్లు మణిరత్నం సినిమాలతో మెరిసిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటిదాకా ఎలాంటి సినిమాలు చేశారన్నది ముఖ్యం కాదు. మణిరత్నంతో సినిమా చేస్తే వాళ్ల రేంజే మారిపోతుంది. ఆయన సినిమాలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఏ హీరోయిన్ అయినా. ఇప్పుడు బాలీవుడ్ భామ అదితి రావు హైదరి వంతొచ్చింది.

దాదాపు దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. ?మర్డర్-3? లాంటి సినిమాల్లో అందాలు ఆరబోసినా.. అదితికి ఇప్పటిదాకా బాలీవుడ్లో ఆశించిన బ్రేక్ రాలేదు. భర్త సత్యదీప్ మిశ్రా నుంచి విడాకులు తీసుకుని.. పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టిపెట్టినా ఆమె కెరీర్ గాడిన పడలేదు. ఐతే ఎట్టకేలకు ఆమెకు మణిరత్నం సినిమా ?కాట్రు వేళయిదే? రూపంలో ఒక బంపర్ ఆఫర్ తగిలింది.

ఇది తమిళ సినిమానే కావచ్చు. కానీ మణిరత్నం సినిమాలో చేస్తే వచ్చే గుర్తింపు అలాంటిలాంటిది కాదు. ఆయన సినిమాలపై బాలీవుడ్ జనాల కళ్లూ ఉంటాయి. బాలీవుడ్ సంగతలా వదిలేస్తే.. సౌత్ లో మంచి పేరొచ్చినా చాలు.. ఇక్కడ హీరోయిన్ల కొరత బాగా ఉంది కాబట్టి.. అవకాశాలు పట్టేయొచ్చు. మణిరత్నం సినిమాలో చేయడం అంటే ఆ స్థాయే వేరుగా ఉంటుంది. ఇందులో మెప్పిస్తే స్టార్ల సరసన అవకాశాలు ఆటోమేటిగ్గా తన్నుకుంటూ వచ్చేస్తాయి. మరి కాట్రువేళయిదే (తెలుగులో డ్యూయెట్) సినిమాతో అదితి ఎలాంటి ముద్ర వేస్తుందో వచ్చే మార్చిలో తేలిపోతుందిలెండి.

,  ,  ,  ,  ,