Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2015 18:09:09
facebook Twitter Googleplus
Photo

సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు అప్పుడప్పుడూ దారుణమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. కొందరు ఆకతాయిలు వారి మీద హేట్ కామెంట్స్ తో రెచ్చిపోతుంటారు. వేలమంది ఫాలోయర్లుంటారు కాబట్టి అంత తేలిగ్గా అకౌంట్ వదిలేయడానికి ఉండదు. అలాగని ఈ హేట్ కామెంట్లను పట్టించుకోకుండానూ ఉండలేరు. ఈ మధ్య యాంకర్ అనసూయ.. బన్నీ మీద కామెంట్స్ తో ఎలా ఇబ్బంది పడిందో తెలిసిందే. ఐతే అనసూయ కామెంట్లలో కొంచెం అతిగా ఉండటంతో అభిమానులకు కోపం రావడంలో అర్థముంది. ఐతే సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఏ తప్పూ చేయకున్నా వివాదంలో చిక్కుకుంది. ఆమె మీద అజిత్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను టార్గెట్ చేసి రెండు మూడు రోజుల పాటు ఏడిపించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

అజిత్ ను అభిమానులు ?తల? అని పిలుచుకుంటారు. తలైవర్ (నాయకుడు) అనే పదానికి షార్ట్ ఫాం ఇది. ఐతే ఈ మధ్య తన కొడుక్కి ఉపనయనం చేయించిన మాధవన్.. ఆ ఫొటో ట్విట్టర్ లో షేర్ చేసి.. దేవుడి ప్రస్తావన తెస్తూ ?తల? అన్న పదం వాడాడు. ఐతే ఓ అజిత్ అభిమాని దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తల అనే పదం అజిత్ కు మాత్రమే సొంతమని.. నీ ఇష్టానికి వాడుకోవద్దు అని ఓ పిచ్చి వార్నింగ్ ఇచ్చాడు. ఈ అభిమానుల తిక్క ఏ స్థాయిలో ఉంటుందో చూడండంటూ చిన్మయి స్క్రీన్ షాట్స్ తీసి.. షేర్ చేసింది. అంతే అజిత్ యాంటి ఫ్యాన్స్ అయిన విజయ్ అభిమానులు రెచ్చిపోయారు. అజిత్ ఫ్యాన్స్ ఆగడాలు చూడండంటూ వాళ్లు రచ్చ రచ్చ చేశారు. ట్విట్టర్లో నిన్నంతా ఈ ఫ్యాన్ వార్ జరిగింది. అజిత్ ఫ్యాన్స్ చిన్మయి మీద హేట్ కామెంట్స్ తో నానా రచ్చ చేశారు. ఐతే చిన్మయి ఏమీ తగ్గలేదు. మీలాంటోళ్ల వల్ల హీరోలకే చెడ్డపేరంటూ ఫ్యాన్స్ ని వాయించేసింది. అయితే చిన్మయికి అజిత్ ఫ్యాన్స్ కి యుద్ధం ఆగింది కానీ.. అజిత్ విజయ్ అభిమానుల గొడవ మాత్రం మరింత శ్రుతి మించింది. ఇప్పటికీ ఆ గొడవ ఆగట్లేదు.

,  ,  ,