Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 12:46:01
facebook Twitter Googleplus
Photo

అక్కినేని అఖిల్? యవసామ్రాట్ అక్కినేని నాగార్జున, అమల ల ముద్దుల తనయుడు. తన తండ్రి నాగార్జున బ్లూ క్రాస్ హాస్పిటల్ లో కొత్త ఎమర్జెన్సీ వార్డు ని ప్రారంభించిన సందర్భంగా ఆఖిల్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
?బ్లూ క్రాస్ కి నాన్న దానమిచ్చిన ఎమర్జెన్సీ వార్డుని ఈ రోజు తన చేతుల మీదుగా ప్రారంభించారు. బ్లూ క్రాస్ ఇప్పుడు పూర్తి స్థాయి జంతువుల ఆసుపత్రి గా మారడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ బ్లూ క్రాస్ ని ఈ స్థాయికి తీసుకురావడానికి చాలా కష్టపడింది. తనకి అభినందనలు? అని తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. జంతు ప్రేమికురాలైన అమల 1992 లో నాగార్జున సహకారంతో బ్లూ క్రాస్ ని స్థాపించారు. ఇక అప్పటినుంచి బ్లూ క్రాస్ జంతు సంరక్షణ కోసం తన దైన కృషి చేస్తున్నది.

,  ,  ,  ,  ,  ,