Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2017 11:06:42
facebook Twitter Googleplus
Photo

అఖిల్.. పెద్ద పరీక్షకు సిద్ధమయ్యాడు. హీరోగా తన తొలి సినిమా అఖిల్ దారుణమైన ఫలితాన్నందుకున్న నేపథ్యంలో ఇప్పుడతడి ఆశలన్నీ హలో మీదే ఉన్నాయి. తొలి సినిమా కంటే కూడా ఇప్పుడతను ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. తొలి సినిమాలో మాస్ మసాలా ట్రై చేసి బోల్తా కొట్టిన అఖిల్.. ఈసారి ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొంచెం భిన్నమైన కథాకథనాలతో హలో సినిమా చేశాడు. ఈ సినిమా ప్రోమోలన్నీ చాలా భిన్నంగా అనిపించాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భరోసా కనిపిస్తోంది. కానీ అన్నీ సానుకూలంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమాకు ఎప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందనేది ఎవ్వరూ ఊహించలేరు.

నిన్న రిలీజైన నాని సినిమా ఎంసీఏ కు వచ్చిన టాక్ హలో టీంకు కలిసొచ్చే విషయమే. ఎంసీఏ రొటీన్ అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. తొలి రోజు వసూళ్లు భారీగానే ఉన్నా.. ఈ సినిమా ఎక్కువ రోజులు నిలబడకపోవచ్చన్న అభిప్రాయయాలు వినిపిస్తున్నాయి. అది ‘హలో’ చేతుల్లోనే ఉంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆడియన్స్ ఇటు టర్న్ అయిపోతారు. లేదంటే ఎంసీఏ ఇదే తరహాలో దూసుకెళ్తుంది. మరి హలో కు ఎలాంటి టాక్ వస్తుంది.. అఖిల్ ఈసారి ఏమేరకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తాడు అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మామూలుగా తన ప్రొడక్షన్లో వచ్చే సినిమాలపై ఆచితూచి ఖర్చు పెట్టే నాగార్జున.. హలో మీద మాత్రం పెట్టుబడి ఎక్కువే పెట్టాడు.

,  ,  ,  ,  ,