Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2017 10:11:52
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ లేనిదే ఎవ్వరు సినిమాను రిలీజ్ చేయడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఒక సినిమా షూటింగ్ ని పూర్తి చేశారంటే చాలు ఇక సినిమా ప్రమోషన్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఇక మనం ఫ్యామిలీ అక్కినేని గ్రూప్ చిత్ర ప్రచారాల్లో ముందు ఉంటోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి ఫ్యామిలీ సినిమా వచ్చిందంటే చాలు అందరు సినిమాని ఓ రేంజ్ లో లేపుతున్నారు. ఇకపోతే అఖిల్ రెండవ సినిమా హలొ మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే అఖిల్ సినిమా ప్రమోషన్ ని కొంచెం డిఫెరెంట్ గా చేస్తున్నాడని చెప్పవచ్చు. సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ అక్కినేని వారసుడు హలో సినిమాల్లోని పాత్రలకు హలో చెప్పండి అంటూ.. ప్రచారాన్ని చేస్తున్నాడు. మొన్న 'అందరికీ హలో.. అంటూ.. సినిమాలో తన పాత్ర అయిన అవినాష్‎కి హలో చెప్పండి' అంటూ పోస్ట్ చేసిన అఖిల్.. రీసెంట్ గా సినిమాల్లో తన పాత్రకు అమ్మ నాన్న పాత్రలను చేసిన క్యారెక్టర్స్ ని చూపించాడు. హలొ సినిమాలో హీరో పేరెంట్స్ గా జగపతి బాబు - రమ్యకృష్ణ నటిస్తున్నారు. అయితే వారిద్దరి ఫొటోను పోస్ట్ చేస్తూ.. అఖిల్ వారికి కూడా హలొ చెప్పండి అని ట్వీట్ చేశాడు. నిజంగా వీరితో కలిసి నటిస్తుండడం చాలా హ్యాపీగా ఉంది. జేబీ గారు చాలా కూల్ గా ఉన్నారు. అలాగే రమ్యకృష్ణ మామ్ నాచురల్ అండ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ.. సినిమాకు కొత్త అందం తెచ్చారని అఖిల్ కామెంట్ చేశాడు. ఇక సినిమా ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. మనం డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను నాగార్జున నిర్మించారు. ఫైనల్ గా డిసెంబర్ 22న సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర యూనీటి సిద్ధమైంది.

,  ,  ,  ,  ,  ,