Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jul-2016 10:48:27
facebook Twitter Googleplus
Photo

అక్కినేని ఫ్యామిలీ మూడో తరం నుంచి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ రెండో సినిమా ఇప్పుడు టాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్స్‌లో ఒకటిగా మారిపోయింది. ?అఖిల్? సినిమాతో భారీ హిట్ కొట్టి గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్న అఖిల్, ఆ సినిమా పరాజయం తర్వాత రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. ఇక ఎన్నో కథలు విని, ఎంతోమంది దర్శకులను మార్చి, చివరకు హను రాఘవపూడితో అఖిల్ తన కొత్త సినిమాను ఖరారు చేసేశారు. కొద్దిసేపటి క్రితం ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా స్పష్టం చేశారు.
రెండో సినిమా ఎప్పుడూ అని చాలాకాలంగా ఎదురుచూస్తున్న వారందరినీ ఇంకా ఎదురుచూసేలా చేయదల్చుకోలేదని తెలుపుతూ, దర్శకుడు హను రాఘవపూడితో కొద్దికాలంగా స్కిప్ట్ వర్క్‌పై ఉన్నానని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తైందని అఖిల్ అన్నారు. షూటింగ్ మొదలుపెట్టేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ఆయన ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ?అందాల రాక్షసి?, ?కృష్ణగాడి వీరప్రేమ గాథ? సినిమాలతో తనదంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్న హను, అఖిల్ సినిమాను కూడా ఓ ప్రేమకథగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,