Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2017 11:34:09
facebook Twitter Googleplus
Photo

తన ఇద్దరు కొడుకుల కెరీర్ లను పరుగులు పెట్టించాలని అక్కినేని నాగార్జున గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని ఏ మాత్రం దాచుకోకుండా ఇప్పటికే పలుమార్లు పైకి చెప్పేశారు కూడా. అందుకు తగ్గట్లుగానే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై.. తనే నిర్మాతగా తన కుమారులతో సినిమాలు చేస్తున్నారు.

తాజాగా రిలీజ్ అయిన నాగ చైతన్య మూవీ 'రా రండోయ్ వేడుక చూద్దాం' మూవీకి టాక్ సాధారణంగా ఉన్నా.. బ్రహ్మండమైన వసూళ్లు రాబట్టింది. చైతు కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలవనుంది. తనే దగ్గరుండి అన్నీ చూసుకున్న సినిమా మంచి హిట్ కొట్టడంతో నాగ్ తెగ హ్యాపీగా ఉన్నారు. అందుకే ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అఖిల్ రెండో సినిమాపై వర్క్ చేస్తున్నారు. అఖిల్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్న నాగ్.. ఇప్పటికే ఈ చిత్రానికి 12 కోట్లు వెచ్చించారట. ఇంత ఖర్చు చేశారు కదా.. సినిమా ఓ కొలిక్కి వచ్చేసిందని అనుకునేందుకు లేదు. ఎందుకంటే ఇప్పటివరకూ రెండు యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే తెరకెక్కించారంతే.

ఈ లెక్కన ఖర్చుపెట్టుకుంటూ వెళితే.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న అఖిల్ రెండో చిత్రం పూర్తయేనాటికి.. మరో 40 కోట్లు ఈజీగా ఖర్చవుతాయని అంటున్నారు.

,  ,  ,  ,  ,