Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2017 15:55:57
facebook Twitter Googleplus
Photo

బాహుబలి ప్రభంజనం ప్రపంచం మొత్తం మారుమోగుతోంది. మన తెలుగు సూపర్ స్టార్స్ అందరూ వాళ్ళ శుభాకాంక్షలును చిత్ర యూనిట్ కి మీడియా ద్వారా ట్విటర్ ద్వారా తెలిపారు. సౌత్ ఇండియా స్టార్స్ కానీ మిగతా పక్క దేశం స్టార్స్ కానీ వీలు పడినప్పుడ్డలా వాళ్ళ అబిప్రాయం చెబుతూనే ఉన్నారు. కానీ మన దేశంలో పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రి అయిన బాలీవుడ్ లోని హింది సినిమా సూపర్ స్టార్స్ కు మాత్రం సినిమా పై అభిప్రాయం చెప్పే ఉద్దేశం లేదో.. లేక చూసే తీరిక లేదో తెలియదు కానీ.. ఒక్కరూ నోరు విప్పి బాహుబలి గురించి మాట్లాడిన ఊసే లేదు.

ఇప్పుడు ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ బాహుబలిపై పలుకులు పలికాడు. అతనెవరో కాదు.. డ్యాషింగ్ హీరో అక్షయ్ కుమారే. బాహుబలిని చూసిన ఆయన.. బాహుబలి సినిమాను చూడడానికి ఇన్ని రోజులుకు వీలుపడింది ప్రతీ బిట్ ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఉంది. మీడియా లో చెబుతున్న ప్రతీ మాటా వాస్తవమే అని ఇప్పుడు అనిపిస్తోంది. ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ స్టేజ్ పై గర్వంగా నిలబెట్టే అద్భుత ఆవిష్కరణ చేసిన రాజమౌళికి కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు. అక్షయ్ తో పాటు మరో యంగ్ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కూడా తనదైన పద్దతిలో అభినందన తెలిపారు. బా..హు..బ..లి.. వావ్.. ఓ మై ఎఫ్ గాడ్ అంటూ ఎక్సయిటింగ్ గా ట్వీటేశాడు రణవీర్.

ఈ ట్వీట్ లు చూసి రాజమౌళి కూడా వెంటనే వాళ్ళకి థాంక్స్ మెసేజ్ కూడా ఇచ్చాడు. బాలీవుడ్ హీరోల్లో బాహుబలిని మెచ్చుకున్న హీరోలు వీళ్ళద్దిరే కావడం భాదాకరం. దేశంలో ఇప్పుడు ప్రతీ స్టార్ రాజమౌలితో పని చేయాలి అని ఎదురుచూస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,