Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2017 10:55:39
facebook Twitter Googleplus
Photo

తమ సినిమా కోసం రకరకాలుగా ప్రచారం చేస్తుంటారు హీరోలు. వీటిలో భాగంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం.. ఎంతో జాగ్రత్తగా మాట్లాడినా నోరు జారడం జరిగిపోతుంటాయి. ఇప్పుడు దువ్వాడ జగన్నాధం ప్రమోషన్స్ లో ఉన్న అల్లు అర్జున్ కూడా.. ఇలాగే దొరికేశాడని అంటున్నారంతా.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. మెగా ఛెయిర్ కు బన్నీ దగ్గరవుతున్నాడా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. 'ఆయన్ను రెప్లికేట్ చేయడం అసాధ్యం. ఏదో ఒక మేనరిజం చూపించినా.. డ్యాన్స్ స్టెప్ వేసినా అది చాలా చిన్నగా ఉంటాయ్. ఆయన్ను అనుకరించడం.. ఇమిటేట్ చేయడం అసాధ్యం. అది ఒరిజినాలిటీ అనిపించుకోదు' అన్నాడు అల్లు అర్జున్.

బన్నీ చెప్పిన మాటలు బాగానే ఉన్నాయ్ కానీ.. ఈ డైలాగ్స్ ఇన్ డైరెక్టుగా కాదు.. డైరెక్టుగా రామ్ చరణ్ నే టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు. తండ్రి చిరంజీవిని అనుకరించడం.. ఆయన పాటలు రీమేక్ చేయడం లాంటివి చెర్రీ సహజంగానే చేస్తుంటాడు. చేయకపోయినా.. వారసత్వంగా వచ్చిన పోలికలతో అవి కనిపిస్తాయి. కానీ ఇమిటేట్ చేయడం ఒరిజినాలిటీ కాదంటూ బన్నీ చేసిన కామెంట్స్.. మెగా పవర్ స్టార్ ను తెగ అభిమానించే వారికి కాస్త గట్టిగానే తగిలినట్లున్నాయి.

అన్నట్లు.. సర్దార్ మూవీలో పవన్ కూడా అన్నయ్య మెగాస్టార్ ను ఇమిటేట్ చేయడమే కాదు.. ఓ స్టెప్ కూడా వేస్తాడు. తేజు సంగతి చెప్పనక్కర్లేదు.

,  ,  ,  ,  ,