Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2016 11:54:44
facebook Twitter Googleplus
Photo

ట్విట్టర్లో హీరోయిన్లకు ఉన్నంతగా హీరోలకు పెద్దగా ఫాలోయింగ్ ఉండదు. మన హీరోలు ఓపిక చేసుకుని ట్వీట్లు పెట్టడం తక్కువ. చిట్ చాట్లు.. ముచ్చట్లు తక్కువ. ఇంకొన్ని కారణాల వల్ల కూడా ట్విట్టర్లో మన స్టార్ హీరోల ఫాలోయింగ్ పెద్దగా ఉండదు. మామూలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఏంటన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ 2014 ఆగస్టులోనే ట్విట్టర్లోకి వచ్చినా ఇప్పటిదాకా పవన్ మిలియన్ ఫాలోయర్ల మార్కును అందుకోలేదు. ఐతే పవన్ కన్నా లేటుగా గత ఏడాది ఏప్రిల్లో ట్విట్టర్లో అడుగుపెట్టిన అల్లు అర్జున్ మాత్రం అప్పుడే మిలియన్ మార్కును టచ్ చేసేశాడు.

సౌత్ ఇండియాలో రజినీకాంత్.. సూర్యల తర్వాత అత్యంత వేగంగా ట్విట్టర్లో మిలియన్ ఫాలోవర్ల మార్కును అందుకున్నది బన్నీనే కావడం విశేషం. ఇంకా మరికొన్ని సోషల్ మీడియా ఘనతలు బన్నీ ఖాతాలో ఉన్నాయి. ట్విట్టర్లో అత్యంత వేగంగా మిలియన్ మార్కును అందుకున్న హీరో బన్నీనే. ఇంకా ఫేస్ బుక్ లోనూ కొన్ని ఘనతల్ని ఖాతాలో వేసుకున్నాడు బన్నీ. అక్కడ అత్యంత వేగంగా మిలియన్.. 5 మిలియన్.. 10 మిలియన్ లైక్స్ అందుకున్న సౌత్ ఇండియన్ హీరో బన్నీనే కావడం విశేషం. ఫేస్ బుక్ లో ప్రస్తుతం బన్నీ పేజీకి లైక్స్ 12 మిలియన్ మార్కుకు చేరువగా ఉండటం విశేషం. యూట్యూబ్ లో ఒక తెలుగు హీరో వీడియో సాంగ్ కు 10 మిలియన్ వ్యూస్ వచ్చింది బన్నీ పాటకే కావడం విశేషం. అలాగే ?సన్నాఫ్ సత్యమూర్తి? హిందీ వెర్షన్ అత్యంత వేగంగా 10 మిలియన్ మార్కు అందుకుని డబ్బింగ్ సినిమాల్లో రికార్డు సృష్టించింది. మొత్తానికి సోషల్ మీడియాలో బన్నీ రికార్డులు చాలానే ఉన్నాయి.

,  ,  ,  ,  ,