Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Oct-2016 17:24:59
facebook Twitter Googleplus
Photo

పూనమ్ పాండే ఏంటి.. మన అల్లు అర్జున్ గురించి మాట్లాడ్డమేంటి అనుకుంటున్నారా..? ఈ హాట్ బేబ్ ఈ మధ్య అనుకోకుండా హైదరాబాద్ వచ్చిందిలెండి. ఇంతకుముందు ?మాలిని అండ్ కో? పేరుతో ఓ తెలుగు సినిమా చేసి ముంబయి చెక్కేసిన పూనమ్.. తాజాగా ఒక తెలుగు సినిమాకు కమిటైన సందర్భంగా ఇక్కడి మీడియాతో మాట్లాడింది. ఆ సందర్భంగానే బన్నీ మాట వచ్చింది పూనమ్ నోటి నుంచి.

ఇండియాలోని సెక్సీయెస్ట్ హాట్ గర్ల్స్ లో ఒకరైన పూనమ్ కు.. ఈ భూమి మీదే మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్ గా కనిపిస్తున్నాడట అల్లు అర్జున్. తెలుగులో సినిమా చేస్తున్నారు కదా.. టాలీవుడ్ గురించి చెప్పండి అంటే.. ఇక్కడ డ్యాన్సులు అదరిపోతాయని చెప్పింది పూనమ్. ఇక్కడి సినిమాల్ని తలుచుకుంటేనే ఊపు వచ్చేస్తుంటూ.. ఇంటర్వ్యూలోనే ఊగిపోతూ మాట్లాడింది పూనమ్.

ఇక ఇక్కడ బాగా నచ్చిన హీరోల గురించి చెబుతూ.. బన్నీ పేరెత్తింది. ఈ భూమి మీద ఉన్న వాళ్లలో బన్నీ మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిన పూనమ్.. అతను గాగుల్స్ పెట్టుకుంటూ ఇచ్చే లుక్ ను గుర్తు చేస్తూ అది భలేగా ఉంటుందని చెప్పింది. అబ్బా.. పూనమ్ పాండేకు కూడా మన బన్నీ అంటే ఇంత లవ్వా అంటూ ఆశ్చర్యపోతూ బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసుకుంటున్నారు.

,  ,  ,