Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jan-2015 11:23:21
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ మామూలుగానే చాలా 'హుషారు'గా ఉంటాడు. ఈ సినిమాలో ఇంకా 'హుషారు'గా ఉంటాడు. అందుకే, ఈ చిత్రానికి అదే టైటిల్ నిర్ణయించాలని అనుకుంటున్నారు. 'జులాయి' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటిస్తున్న చిత్రానికి ఈ 'హుషారు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు, ఇది దాదాపు ఓకే అయినట్టూ సమాచారం. మొదట్లో ఈ చిత్రానికి 'త్రిశూలం' అనే టైటిల్ అనుకున్నారు. అయితే, 'హుషారు' బాగా సూటవుతుందని ఫిక్స్ అవుతున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంతా, ఆదా శర్మ, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,