Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2015 11:05:30
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ ఇప్పుడు 'జాదూగర్' అవతారం ఎత్తుతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ఈ పేరును ఖరారు చేస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న చిత్రానికి మొదట్లో 'త్రిశూలం' టైటిల్ అనుకున్నారు. తర్వాత 'హుషారు' అనే టైటిల్ పరిశీలనకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'జాదూగర్' టైటిల్ని ఇక ఫైనల్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ టైటిల్ కథకు, బన్నీకి బాగా సూటవుతుందన్న నిర్ణయానికి వచ్చారట. ఇందులో బన్నీ సరసన సమంతా, ఆదా శర్మ, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

,  ,  ,  ,  ,