Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jan-2015 10:50:05
facebook Twitter Googleplus
Photo

ఈమధ్య దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలకు వెరైటీ టైటిళ్లు పెడుతున్నాడు. ఆమధ్య పవన్ కల్యాణ్ నటించిన చిత్రానికి 'అత్తారింటికి దారేది' అంటూ సంప్రదాయ భిన్నంగా టైటిల్ పెట్టిన ఈ దర్శకుడు, తన తాజా చిత్రానికి 'సన్నాఫ్ సత్యమూర్తి' పేరు పెట్టాడు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తాజాగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఈ 'సన్నాఫ్ సత్యమూర్తి' టైటిల్ని ఖరారు చేశారు. 'త్రిశూలం', 'హుషారు', 'జాదుగర్' వంటి పేర్లు పరిశీలించినా చివరికి దీనినే ఫైనల్ చేసినట్టు సమాచారం. బన్నీ వెడ్డింగ్ ప్లానర్ గా నటిస్తున్న ఈ సినిమాలో సమంతా, ఆదా శర్మ, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,