Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2016 13:19:17
facebook Twitter Googleplus
Photo

వెవ్ లెంగ్త్స్ మ్యాచై.. గాట్టిగా కనెక్టయ్యే హీరో- డైరెక్టర్స్ కాంబినేషన్స్ చాలా తక్కువగా ఉంటాయ్. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి హిట్ కాంబోలు చాలా ఉండేవి. కానీ ఈ మధ్య హీరో- దర్శకుల మధ్య ఎలాంటి కెమిస్ట్రీలు కనిపించట్లేదు. టాప్ హీరోలతో మూవీ చేసి కెరీర్ గ్రాఫ్ పెంచుకోవాలనే ఆరాటంలో దర్శకులుంటే.. హిట్ కొట్టిన వాళ్లతోనే పని చేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడో ఇద్దరు ముగ్గురు హీరోలు మాత్రమే సేమ్ డైరెక్టర్ తో మళ్లీ మళ్లీ పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వాళ్లలో బన్నీ- త్రివిక్రమ్ కాంబో ఒకటి.

జులాయ్.. సన్నాఫ్ సత్యమూర్తి అంటూ అర్జున్ కెరీర్లో రెండు మొమరబుల్ మూవీస్ ఇచ్చాడు డైరెక్టర్ త్రివిక్రమ్. అందుకే మాటల మాంత్రికుడితో సినిమా అంటే మిగిలిన ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టేయడానికి సిద్ధమైపోతాడు అల్లు వారబ్బాయ్. ఇటు త్రివిక్రమ్ కూడా అంతే పవన్ మహేష్ తర్వాత బన్నీతోనే అంత కంఫర్ట్ ఫీలైనట్టున్నాడు రెండుసార్లు పనిచేశాడు. ఇక ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతుందని త్వరలో కొత్త సినిమా ప్రారంభం కానుందని కొన్ని రోజుల క్రితం వరకు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడున్న సిట్యువేషన్ చూస్తుంటే వీళ్లద్దరూ కలిసి పని చేయాలంటే కొంచెం టైం పట్టేలా ఉంది.

త్రివిక్రమ్ పవన్ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. 2017 ఫస్ట్ హాఫ్ ఈ మూవీతోనే సరిపోయే అవకాశాలున్నాయ్. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఆరాటపడ్తున్నాడు. వచ్చే ఏడాది సెకండాఫ్ ఆ మూవీ ఉండొచ్చంటున్నారు. ఒకవేళ జూనియర్ తో మిస్సైన మహేష్ ఎలాగూ లైన్లో ఉన్నాడు. మురుగదాస్.. కొరటాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో చేయాలని ఫిక్సైపోయాడు. ఇటు బన్నీ కూడా దువ్వాడ జగన్నాథమ్ చేస్తూనే పనిలో పనిగా లింగుస్వామి.. విక్రమ్ కుమార్లతో కమిటయ్యాడు. అంటే సినిమా షూటింగ్స్.. మధ్యలో తీసుకునే బ్రేక్స్ అన్నీ కలిపి రెండేళ్లు ఈజీగా అయిపోతాయ్. ఆ తర్వాతే బన్నీ- త్రివిక్రమ్ ఉండొచ్చంటున్నారు. అయినా హిట్ కాంబినేషన్లో మూవీ రావాలేగానీ రెండేళ్లు ఓ లెక్క అంటున్నారు అభిమానులు

,  ,  ,  ,  ,