Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Nov-2017 14:10:31
facebook Twitter Googleplus
Photo

ఒక్కో సినిమాలో ఒక్కో హెయిర్ స్టైల్ తో ఆకట్టుకుంటూ ఉంటాడు. ప్రతీ సినిమాకి తన స్టైలింగ్ ను కంప్లీట్ ఛేంచ్ చేసేస్తూ ఉంటాడు. అందుకే అల్లు హీరోకు స్టైలిష్ స్టార్ అనే బిరుదు వచ్చింది.

ఇప్పుడు నా పేరు సూర్య అంటూ రైటర్ వక్కంతం వంశీతో కొత్త సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీ షూటింగ్ మొదలయ్యి.. కొన్ని నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ మూవీకి సంబంధించిన చిన్న లీక్ కూడా బయటకు రాలేదు. రిలీజ్ కి ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి.. అప్పుడే ఫస్ట్ లుక్ ఎక్స్ పెక్టే చేయడం కూడా సాధ్యం కాదు. అయితే.. ఇప్పుడు నాగచైతన్య-సమంతల రిసెప్షన్ కారణంగా.. తన తర్వాత చిత్రంలో అల్లు అర్జున్ లుక్ ఏంటో జనాలకు తెలిసిపోయింది. ఈ రిసెప్షన్ లో చైతు-సామ్ లే మెయిన్ అట్రాక్షన్ అయినా.. బన్నీ లుక్స్ గురించి హాట్ డిస్కషన్స్ మొదలైపోయాయి. కనిపించీ కనిపించకుండా ఉన్న గెడ్డం.. మిలిటరీ హెయిర్ కట్ చూస్తే.. నా పేరు సూర్య సినిమా కోసమే.. బన్నీ ఇలా ప్రిపేర్ అయ్యాడనే సంగతి తెలిసిపోతోంది.

సహజంగా కేరక్టర్ ఏదైనా.. తమ స్టైలింగ్ నే కంటిన్యూ చేయడం గతంలో ఉండేది. కానీ ఇప్పుడు కేరక్టర్ కు తగినట్లుగా మారిపోతున్నారు స్టార్ హీరోలు.

,  ,  ,  ,  ,