Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jun-2017 10:41:33
facebook Twitter Googleplus
Photo

మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ కు సినిమా తీసిన తరువాత ప్రమోషన్ చేయడానికి కనిపించే ఓకే ఒక దారి ఆడియో ఫంక్షన్. అందరూ వస్తారు.. సినిమా గురించి మాట్లాడతారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు అంతా బాగుంది. మళ్ళీ సినిమా విడుదలై విజయం అయితే కానీ ప్రమోషన్లకు రారు.. వచ్చినా ఏదో మొక్కుబడికి చేస్తునట్లు వచ్చి వెళ్లిపోతారు. ఈ విషయం లో బాలీవుడ్ నటి నటులు నుంచి మనవాళ్లు కాస్త నేర్చుకోవాలిసింది ఉంది. సినిమాలో కలిసి నటించడం ఎంత ముఖ్యమో కలిసి ప్రమోషన్ చేయడం కూడ అంతే ముఖ్యం. అక్కడ హీరో హీరోయిన్ కలిసి మంచి స్నేహితులు లా కలిసిమెలిసి ప్రమోషన్ లో పాల్గొంటారు. మరి మన దగ్గర హీరో.. హీరోయిన్ పక్కన నిలబడటానికి కూడ సిగ్గుపడతాడు.

బాలీవుడ్లో హీరో అండ్ హీరోయిన్ హగ్ చేసుకుని ఫోజులు ఇస్తారు ప్రెస్ మీట్స్ లో. మనోళ్ళు మాత్రం సిగ్గుపడుతున్నారు. దువ్వాడ జగన్నాధం ప్రమోషన్ లో కూడ పూజా హెగ్డే.. అల్లు అర్జున్ నడుంపై చేయివేసినా కూడా.. బన్నీమాత్రం సిగ్గపడ్డాడు. బెంగుళూరు ప్రమోషన్లకు వెళ్ళినప్పుడు పూజా కాస్త క్యాజువల్ గా క్లోజుగా నుంచుంటే.. బన్నీ మాత్రం అలర్ట్ గా మోహమాట పడుతూ నుంచున్నాడు. మనోల్ళు ఈ మొహమాటాలు ఎప్పుడు వదిలేస్తారో ఏంటో అర్ధం కావటంలేదు. ఇప్పటికీ మన వాళ్ళకి ఆలింగనం అంటే తప్పుడు అభిప్రాయం ఉండిపోయింది. అది ఒక మంచి ఆత్మీయ పలకరింపుగా ఎవరు ఆలోచించారు. అలా చేస్తే మళ్ళీ అది ఒక పెద్ద న్యూస్ చేస్తారు అని భయం కూడ కావచ్చు. కారణం ఏదైనా మన హీరోలుకు కాస్త సిగ్గునే చెప్పాలి.

,  ,  ,  ,  ,  ,