Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jul-2017 10:47:13
facebook Twitter Googleplus
Photo

నాలుగు రోజులు పనిమీద వెళ్ళాడని అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా ఓ రెండు వారాల నుండి అక్కడే మకాం ఉంటున్నాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. మనోడు చాలా రోజుల నుండి ముంబాయ్ లోనే ఉంటున్నాడు. తనొక్కడే కాదు.. ఏకంగా వైఫ్ స్నేహా రెడ్డి కూడా అక్కడే ఉంటోంది. ఇంతకీ అక్కడ ఏం చేస్తున్నట్లంటే.. తన సినిమా పనే కాకుండా వేరే ఏదో కూడా చేస్తున్నాడట.

త్వరలోనే షూటింగ్ కు వెళ్ళనున్న నా పేరు సూర్య సినిమా కోసం సంగీత దర్శకుడు విశాల్ అండ్ శేఖర్ తో కూర్చుని మనోడు దగ్గరుండి ట్యూన్లు కంపోజ్ చేయించుకుంటున్నాడట. వక్కంతం వంశీ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఆర్మీ మ్యాన్ గా కనిపించనున్న బన్నీ.. సంగీతంపై స్పెషల్ శద్ర పెట్టాడు. అయితే ముంబాయ్ లో ఉంటూ.. అక్కడ రొహిత్ శెట్టి తీస్తున్న గోల్ మాల్ రిటర్న్స్ షూటింగ్ స్పాటులో కూడా మెరిశాడు. అంతేకాదు.. ఒక పోష్ బార్ అండ్ రెస్టారెంటుకు తన భార్యతో కలసి డిన్నర్ కు కూడా వెళ్యాడు. చూస్తుంటే ఇదేదో మ్యూజిక్ సెట్టింగులకు మాత్రమే వెళ్ళినట్లు అనిపించట్లేదు కదూ. మరేముందో మర్మం?

ప్రస్తుతం బన్నీ అక్కడ కొన్ని యాడ్ ఏజన్సీలు మరియు బ్రాండింగ్ ఏజన్సీలతో డిస్కషన్లు జరుపుతున్నాడట. మొన్నటివరకు రామ్ చరణ్ ప్రొఫైల్ ను హ్యాండిల్ చేసిన పిఆర్ ఏజెన్సీతో మంతనాలు సాగిస్తున్నాడట. ఇక నుండి కొత్త కొత్త బ్రాండులకు ఎండార్సర్ గా సంతకాలు పెట్టేస్తూ.. సంవత్సరానికి ఒక సినిమా పది యాడ్లు అన్న చందాన కెరియర్ ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడట.

,  ,  ,  ,  ,