Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2017 13:02:11
facebook Twitter Googleplus
Photo

కెరీర్ పరంగా అల్లు అర్జున్ పీక్ స్టేజ్ లో ఉన్నాడు. స్టైలిష్ స్టార్ సినిమాలో కనిపిస్తే చాలు.. మినిమం 50-60 కోట్ల వసూళ్లు గ్యారంటీ అనే స్టేజ్ కి వచ్చేశాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న డీజే-దువ్వాడ జగన్నాధంకు.. ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేయకపోయినా.. ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ చూసి.. ట్రేడ్ జనాలకు మతిపోతోంది.

మరోవైపు.. పర్సనల్ గా కూడా అల్లు అర్జున్ బోలెడంత హ్యాపీగా ఉన్నాడు. రీసెంట్ గా పుట్టిన కూతురు అల్లు అర్హాతో ఓ నెల్లాళ్లు హ్యాపీగా స్పెండ్ చేసిన బన్నీ.. ఇప్పుడు తన ఫ్యామిలీ మొత్తంతో తిరుపతి వెళుతున్నాడట. ఈ విషయాన్ని అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి స్వయంగా చెప్పింది. అయితే.. ఈ పోస్ట్ చేసిన ఓ ఫోటో మాత్రం భలే చూడముచ్చటగా ఉంది. అల్లు అర్జున్.. కొడుకు అల్లు అయాన్ లు ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఫోటోను షేర్ చేసింది స్నేహా రెడ్డి.

ఇందులో హాఫ్ వైట్ కుర్తా పైజమా ధరించిన అల్లు అర్జున్ తో పాటు.. పక్కనే స్టూల్ మీద మ్యాచింగ్ డ్రెస్ వేసిన అయాన్ కనిపిస్తాడు. చలిగా ఉందని.. ఓ స్వెటర్ వేశారు లెండి. 'మ్యాచింగ్ డ్రస్ లలో తండ్రీ కొడుకులు.. తిరుపతి' అంటూ కామెంట్ చేసింది స్నేహారెడ్డి. అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసే ఫోటోలు మాత్రం.. లైఫ్ లాంగ్ మెమరబుల్ రేంజ్ లో ఉంటుండడం విశేషం.

,  ,  ,  ,  ,