Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2017 10:14:01
facebook Twitter Googleplus
Photo

సీనియర్ నటుడు చలపతి రావు మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యలపై అనుకున్న దాని కంటే ఎక్కువగానే వ్యతిరేకత వ్యక్తమైంది. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో చలపతి రావు ఈ వ్యాఖ్యలు చేయగా.. ఈ సినిమాకు నిర్మాత అయిన నాగార్జున ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్విట్టర్ వేదికగా ఆ వ్యాఖ్యల్ని ఖండించాడు. నాగార్జున తనయుడు నాగచైతన్య సైతం వెంటనే స్పందిస్తూ.. చలపతి వ్యాఖ్యల్ని తప్పుబట్టాడు. రారండోయ్.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సైతం కొంచెం గట్టిగానే స్పందించింది. ఐతే వీళ్లందరూ అంత వేగంగా రెస్పాండవ్వడానికి.. చలపతిరావు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడానికి కారణం నాగార్జున సతీమణి అమలేనని సమాచారం.

ఆమె చలపతి రావు వ్యాఖ్యలపై చాలా సీరియస్ అయ్యారట. తమ సంస్థలో రూపొందిన సినిమాకు సంబంధించిన వేడుకలో అమ్మాయిల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ఆమె మండిపడ్డారట. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆమె.. నాగార్జునతో పాటు చైతూ.. రకుల్ లతోనూ మాట్లాడి వెంటనే ఖండనలు ఇచ్చేలా చూసిందట. అమల చూడ్డానికి సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ.. కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటుంది. గతంలో ఒక వేడుక సందర్భంగా ఓ వ్యక్తి అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని వ్యాఖ్యానించడంపై ఆమె సీరియస్ అయ్యారు. నేను అబద్ధాలు ఆడతాను. ఆడపిల్లలు పుడతారా అంటూ ఆ వ్యక్తిని వేదిక మీదే నిలదీశారు. మరో వేడుకలో ఎవరో హీరో నక్క తోక తొక్కి హీరో అయ్యాడు అని యాంకర్ వ్యాఖ్యానించగా.. దాని మీదా ఆమె అలాగే స్పందించారు. జంతు ప్రేమికురాలైన ఆమె నక్క తోకే కాదు.. కుక్క తోక కూడా తొక్కకూడదని.. అసలు ఏ జంతువునూ ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. తామేదో మాట వరసకు అన్నామన్నా వినని అమల.. ఆ యాంకర్ తో వేదిక మీదే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పించడం గమనార్హం.

,  ,  ,  ,  ,