Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2016 10:27:59
facebook Twitter Googleplus
Photo

అమలా పాల్.. ఈ పేరు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలనం. తమిళంలో ఆమె చేసిన తొలి సినిమాలో కొడుకును పెళ్లి చేసుకుని మామతో శృంగారం నడిపే పాత్రను పోషించింది. అది పెద్ద దుమారం రేపి.. ఆమెకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఐతే అలాంటి నేపథ్యం నుంచి వచ్చి.. అనూహ్యంగా స్టార్ హీరోయిన్ అయ్యి తన ప్రత్యేకతను చాటుకుంది అమల. కెరీర్ పీక్స్ లో ఉండగా.. 23 ఏళ్లకే దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకోవడం ఓ సంచలనం. రెండేళ్లు తిరిగేసరికి విజయ్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడమూ అనూహ్యమే. ఇలా అమల జీవితంలో ఎన్నెన్ని మలుపులో.

విజయ్ నుంచి వేరు పడ్డాక హాట్ హాట్ ఫొటో షూట్లతో.. జాలీ జాలీ హాలిడే ట్రిప్పులతో వార్తల్లో నిలుస్తున్న అమల.. తాజాగా విజయ్ గురించి ఆసక్తికర కామెంట్లతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. విజయ్.. అతడి తల్లిదండ్రులు పెట్టిన రిస్ట్రిక్షన్స్ భరించలేకే అతడి నుంచి విడిపోయిందనుకున్న అమల.. అతడి గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడింది ఒక ఇంటర్వ్యూలో. విజయ్ ను ఎప్పటికీ.. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటానని.. అతడితో విడిపోవాలన్న నిర్ణయం తన జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన.. బాధాకరమైన విషయం అని ఆమె వ్యాఖ్యానించింది. ఐతే ఈ పరిణామాలన్నీ తన జీవితంలో పాఠాలని ఆమె పేర్కొంది. 23 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం తప్పిదంగా భావించట్లేదని.. తాను సరైన సమయంలోనే పెళ్లి చేసుకున్నానని ఆమె పేర్కొనడం విశేషం. తనను ఎవరూ గైడ్ చేసేవాళ్లు లేరని.. తాను చేసిన తప్పులే తనకు పాఠాలు నేర్పుతున్నాయని కూడా ఆమె వ్యాఖ్యానించింది.

,  ,  ,  ,  ,