Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2017 13:45:02
facebook Twitter Googleplus
Photo

హీరో ధనుష్ హీరోగా నటించిన విఐపి 2 తెలుగు తమిళ్ హింది భాషలులో విడుదలకావడానికి అంతా సిద్దమైంది. రఘువరన్ బి.టెక్ సినిమా తెలుగులో మంచి హిట్ అవ్వడంతో ఇప్పుడు విఐపి 2 సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాను సౌందర్య రజినీకాంత్ డైరెక్ట్ చేయగా కథ మాటలు ధనుష్ అందించాడు. ఈ సినిమా విడుదల దగ్గర పడటంతో ప్రచారం గట్టిగానే చేస్తున్నారు విఐపి2 టీమ్. అయితే హింది లో కానీ తెలుగులో కానీ మీడియా ముందుకు వస్తుంది డైరెక్టర్ సౌందర్య రజినీకాంత్ - హీరో ధనుష్ లేదా మరో ముఖ్య పాత్రదారి బాలీవుడ్ నటి కాజోల్ కనిపిస్తున్నారు కానీ విఐపి2 హీరోయిన్ అమలాపాల్ మాత్రం ఎక్కడ కనిపించటం లేదు. కానీ విడుదలకు రెండు రోజులు ముందు ఇప్పుడు ఇలా వైట్ గౌన్ లో హాట్ గా ప్రచారం చేయడానికి వచ్చింది.

విఐపి2 సినిమా ట్రైలర్ లో కూడా కాజోల్ ధనుష్ ను మాత్రమే ఎక్కువ హైలైట్ చేసి చూపించారు. బహుశా కథ మొత్తం ఈ ఇద్దరు చుట్టే ఉంటుంది అని చెప్పడానికి కాబోలు. ఏదైనా అమలాపాల్ విఐపి2 ప్రచారాన్ని కొంచెం పక్కన పెట్టింది అనే చెప్పాలి. కానీ ఒక్కసారిగా ఒక మీడియా ఇంటర్వ్యూ కి ఇలా రోజా పూల లాంటి తన అందాన్ని తెల్లని ఫ్యాషన్ డ్రెస్స్ లో చుట్టి వచ్చింది. అమలాపాల్ ఇప్పుడు తమిళ్ సినిమాలతో బిజీ గా ఉన్న ఆమె ఎక్కడకు వెళ్ళిన సూచి లీక్స్ వివాదం వెంటాడుతుంది. విఐపి2 మొదట ప్రచార సమయంలో కూడా ధనుష్ అమలాపాల్ కలిసి తమిళ్ మీడియా ముందుకు వచ్చినప్పుడు అందరూ సూచి లీక్స్ పైనే ఫోకస్ పెట్టారు. దానికి అమలాపాల్ కొంచం ఘాటుగానే సమాధానాలు ఇచ్చింది. ఈ వివాదంలో ధనుష్ కూడా ఉండటం తో చేత అనవసర గొడవ ఎందుకు అని రాలేదు ఏమో విఐపి2 ప్రచారానికి.

ఆగష్టు 11 న విడుదలకాబోతున్న ఈ సినిమా ప్రచారానికి వచ్చిన అమలాపాల్ మాత్రం మాట్లాడుతూ “ నేను ధనుష్ తో కలిసి పని చేసినందుకు చాలా సంతోశంగా ఉంది. నా షూటింగ్ షెడ్యూల్ కారణంగా నేను ప్రచారంలో యాక్టివ్ గా ఉండలేకపోయాను” అని చెప్పింది. తన ప్రేమ పెళ్లి పెటాకులు అయి తరువాత సూచి లీక్స్ విషయం బాగా వివాదంగా మారిన తరువాత అమలా పాల్ కొంచెం మీడియా కు దూరంగా ఉన్న మాట అయితే వాస్తవం అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,