Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jan-2016 11:57:58
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ సాలా ఖడూస్ ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. హిందీ - తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ మూవీలో.. తమిళ హీరో మాధవన్ బాక్సింగ్ కోచ్ గా నటించాడు. త్రీ ఈడియట్స్ - పీకే లాంటి సూపర్బ్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్ హిరాణీ తొలిసారిగా నిర్మాతగా మారి తీసిన సినిమా సాలా ఖడూస్.

తమిళ్ లో ఇరుదు సూత్రు పేరుతో రిలీజ్ అయిన ఈ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ ని కూడా ఓ భాగం చేసేశారు మేకర్స్. ఇలా తను ఈ మూవీలో ఓ పార్ట్ అయిపోయినట్లు రజినీకి కూడా తెలీదంటే ఆశ్చర్యం వేస్తుంది. అయినా ఇది నిజమే. సాలా ఖడూస్ స్టోరీలో భాగంగా హీరోకి తన సీనియర్ తో వివాదం రావడంతో.. చెన్నైకి ట్రాన్స్ ఫర్ చేస్తారు. అక్కడికి వెళ్లాక.. ప్రతీ చోటా రజినీ ఫోటోలు - బ్యానర్లు చూపిస్తూ.. మూవీకి సూపర్ స్టార్ ఫ్లేవర్ అద్దేశారు.

రజినీకి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో తెలుసు కాబట్టి ఇది తమిళ్ వెర్షన్ కు బాగా ప్లస్ అవుతుంది. అయితే హిందీ సినిమాలో కూడా ఇదే ఫ్లేవర్ ని మెయింటెయిన్ చెయ్యడం విశేషం. తెలుగు వ్యక్తి అయిన సుధ కొంగర ప్రసాద్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా.. స్పోర్ట్స్ పర్సనాలిటీ రితికా సింగ్ కీలక పాత్ర పోషించింది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చిన సాలా ఖడూస్ కి.. మంచి రివ్యూలే వస్తున్నాయి.

,  ,