Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2017 11:40:12
facebook Twitter Googleplus
Photo

ఎక్కువగా వినిపించే ఒక పదం ఏంటంటే.. సచ్చిందిరా గొర్రె అంటుంటారు. అంటే ఎవరన్నా ఏదన్నా విషయంలో ఫెయిల్ అయ్యారనుకోండి.. లేదన్నా ఎక్కడన్నా తప్పటడుగు వేసినా కూడా.. వారిని అలా తిడుతుంటారు. ఇంగ్లీషులో యు ఫూల్ అన్నట్లు అనుకోండి. ఇప్పుడు ఈ మాటను టైటిల్ గా మార్చుకుని.. అనసూయను లీడ్ లో పెట్టి.. ఒక సినిమా తీస్తున్నారు తెలుసా!!

నూతన దర్శకుడు శ్రీధర్ రెడ్డి యర్వా డైరక్షన్ లో.. అనసూయతో పాటు శ్రీనివాస్ రెడ్డి.. శివా రెడ్డి.. శకలక శంకర్ తదితరులు నటిస్తున్న సినిమా సచ్చిందిరా గొర్రె. ఈ సినిమాలో అనసూయది లీడ్ క్యారక్టర్ అని చెప్పలేం కాని.. ఈ సినిమాలో తన పాత్ర పరిధి ఎంత ఏంటి అనేది చూసుకోలేదు అంటోంది ఈ హాట్ యాంకర్. ఎందుకంటే అమ్మడు కేవలం లీడ్ రోల్స్ మాత్రమే చేస్తానంటూ మడికట్టుకుని కూర్చోలేదట.. పాత్ర బాగుంటే ఎలాంటి రోల్ అయినా చేసేస్తాను అంటోంది. అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదో థ్రిల్లర్ కామెడీ అట.

ఇకపోతే ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ జరిపేసుకుంటోంది. చడీచప్పుడు లేకుండా అప్పుడే రెండో షెడ్యూల్ కూడా తీసేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,