Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Aug-2016 11:54:07
facebook Twitter Googleplus
Photo

క‌ల్యాణ్ రామ్ కి అదిరిపోయే హిట్ ఇచ్చింది ప‌టాస్‌. దాదాపు ప‌దేళ్ల త‌ర‌వాత హిట్ అనే మాట వినిపించింది ఈ నంద‌మూరి హీరోకి. ఈ సినిమాతోనే అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ చూపించుకొన్నాడు. ఆ త‌ర‌వాత సుప్రీమ్ తో మ‌రో హిట్ కొట్టాడు.

అయితే మ‌ళ్లీ క‌ల్యాణ్ రామ్‌తో ఓ సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ట‌. ప‌టాస్ స‌మ‌యంలోనే క‌ల్యాణ్ రామ్ ? అనిల్ రావిపూడి క‌ల‌సి ప‌నిచేయాల‌ని ఫిక్స‌య్యారు. కానీ? ఎవ‌రి సినిమాల‌తో వాళ్లు బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఆ కాంబినేష‌న్ సెట్ట‌వ్వ‌లేదు. ఇటీవ‌లే క‌ల్యాణ్‌రామ్‌ని క‌లిసిన అనిల్ రావిపూడి.. ఓ క‌థ వినిపించాడు. ఇప్పుడీ సినిమా గ్రీన్ సిగ్నల్ దొరికేసిందని లేటెస్ట్ కబర్. పూరి తో చేస్తున్న ?ఇజం? పూర్త‌య్యాక అనిల్ రావిపూడి సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.

,  ,  ,  ,  ,