Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Dec-2014 11:08:34
facebook Twitter Googleplus
Photo

అందాల అంజలిపై గత కొంత కాలంగా ఏదో ఒక వివాదం నెలకొంటూనే వుంది. ఎప్పుడూ ఏదోఒక రూమర్ తో ఆమె వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. తాజాగా తమిళ కమెడియన్ సతీష్ ను ఆమె వివాహం చేసుకుందని ఒక్కసారిగా కోలీవుడ్ లో ప్రచారం మొదలైంది. ఇటీవలి కాలంలో సతీష్ కమెడియన్ గా బాగా ఎదుగుతున్నాడు. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇదే విషయం ఈ తమిళ నటుడి వద్ద ప్రస్తావిస్తే, పెద్దగా నవ్వేస్తూ, "అసలు అంజలిని నేనింతవరకు ఒక్కసారి కూడా కలవలేదు. ఆమెను సినిమాలలో చూడడం తప్ప ఆమెతో నాకు అసలు పరిచయమే లేదు. మరి, ఈ వార్తని ఎవరు పుట్టించారో!" అంటున్నాడు. అంజలికి వ్యతిరేకంగా కొంతమంది ఇలాంటి రూమర్లు సృష్టిస్తూ ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,