Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2016 10:29:49
facebook Twitter Googleplus
Photo

మలయాళ వర్షెన్ ప్రేమమ్ చూసిన వారందరికీ.. ఆ సినిమాలోని పాత్రల పేరులన్నీ బాగా గాట్టిగానే కనెక్ట్ అయిపోతాయ్. సినిమా కథ తాలూకు ఇంపాక్ట్ ఆ రేంజులో ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ లీడ్ సాయి పల్లవి పోషించిన మలార్ పాత్ర.. అలాగే మరో లీడ్ అనుపమ పరమేశ్వరన్ పోషించిన మేరి జార్జ్ పాత్ర బాగా ఆకట్టుకుని.. వారి పేర్లు మనకు గుర్తుండిపోయేలా చేస్తాయ్.

అయితే మలయాళ వర్షెన్ లో మేరీ జార్జ్ పాత్రతో హీరో కూడా మాంచి కామెడీలే చేస్తుంటాడు. పైగా పెళ్ళయ్యాక ఇంటిపేరు మార్చుకున్నా సరే.. ఆమె పేరు మేరి జార్జ్ అనే ఉంటుంది అంటూ ఒక సీన్లో కామెడీ బాగా పండింది. ఇకపోతే తెలుగులో కూడా ఈ పాత్రను స్వయంగా తానే చేస్తున్న అనుపమ.. ఇక్కడ ఏ జార్జ్ గా మారింది మరి? అదే విషయాన్ని అనుపమనే అడిగితే.. ''తెలుగులో నా పేరు సుమ అని పెట్టారు. పైగా అక్కడికీ ఇక్కడికీ నేటివిటీ మొత్తం మారిపోయింది. కాకపోతే ఒరిజనల్ ప్రేమమ్ కంటే తెలుగు ప్రేమమ్ లో నా రోల్ లెంగ్త్ కాస్త ఎక్కువే. ఇక్కడి టీమ్ కూడా చాలా బాగా సినిమాను తీశారు. అవుట్ పుట్ ఎలా ఉందో చూడలేదు కాని.. సినిమా పెద్ద హిట్టవుతుందని నా నమ్మకం'' అని చెప్పింది.

ఇంతకీ అమ్మడు ఈ సినిమా తరువాత తెలుగులో వరుసపెట్టి పెద్ద సినిమాలు ఒప్పేసుకుని పాపులర్ అయిపోతుందా మరి? ''నాకు అంత ఆశ లేదు. తెగ సినిమాలు ఒప్పేసుకుని డబ్బులు సంపాదించాలనే కోరిక అస్సలే లేదు. మంచి క్యారక్టర్లు వస్తేనే చేస్తాను. అ.ఆ తరహాలో నెగెటివ్ రోల్స్ అయినా రెడీ'' అని సెలవిచ్చింది అనుపమ.. అదే అక్కడ మేరి ఇక్కడ సుమ.

,  ,  ,  ,  ,