Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Aug-2016 12:15:06
facebook Twitter Googleplus
Photo

ముద్దుగుమ్మ అనుష్క, నాగార్జునల బంధం ప్రత్యేకమైనది అని చెబుతుంటారు. నాగ్ అంటే స్వీటీకి చచ్చేంత ఇష్టం. ఆయన ప్రతి సినిమాలోనూ పైసా కూడా తీసుకోకుండా నటించేందుకు కూడా స్వీటీ సిద్ధమే. ఎందుకంటే.. ? స్వీటీకి లైఫ్ ఇచ్చింది నాగే నట. స్వీటీ ఫస్ట్ చిత్రం నాగ్ ?సూపర్?తోనే ఎంట్రీ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్వీటీ హాట్ హాట్ గా కనిపించింది. ఇక, అప్పటి నుంచి స్వీటీకి బ్యాక్ బోన్ గా నిలిచాడట నాగ్.

నాగ్-స్వీటీల మధ్య అదేదో ఉందని.. రకరకాలు కథనాలు వచ్చాయి. ఇవేవీ కూడా పట్టించుకొని స్వీటీ.. నాగ్ నాకు చాలా ప్రత్యేకం. నాకు మంచి స్నేహితుడు అని చెబుతూ ఉంటుంది. ఇక, నాగ్ మాత్రం తన ప్రతి సినిమాలో స్వీటీ ఉండాలనే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ?ఊపిరి? చిత్రంలో స్వీటీ స్పెషల్ రోల్ లో మెరిసింది. నాగ్ తాజా భక్తిరస చిత్రం ?నమో: వెంకటేశయా?లోనూ కృష్ణమ్మగా కనిపించనుంది స్వీటీ.

అయితే, నాగ్ అంటే మహా ఇష్టపడే స్వీటీ.. నాగ్ ప్రతి పుట్టినరోజుకి సర్పైజ్ గిఫ్ట్ ఇస్తుందట. ఈరోజు ఆగస్ట్ 29 నాగ్ పుట్టినరోజు. మరీ.. ఈసారి.. నాగ్ కి స్వీటి గిఫ్ట్ ఏమీ ఇచ్చిందనే ఆసక్తి నెలకొంది. అదేంటన్నది తెలుసుకోవాలని ఈరోజు సోషల్ మీడియాలో అనుష్క ని తెగ ఫాలో అవుతున్నారు
నెటిజర్లు. ఆ గిఫ్ట్ ఏంటో ఏ ఫేస్ బుక్ నో, ట్విట్టర్ ఖాతా ద్వారానే స్వీటీ చెబుతుందని ఆశపడుతున్నారు. బహుశా.. ఈసారి పర్సనల్ గిఫ్ట్.. అదేనండీ.. చెప్పుకోలేని గిఫ్ట్ ఏమైనా ఇచ్చి ఉంటుందనే గుసగుసలు వినబడుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,