Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2015 11:03:43
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు తన అందచందాలతో రారాణిగా రాణించిన అనుష్క కెరీర్ ఇక ఇప్పుడు చివరి దశకు చేరింది. దాంతో ఆమె వివాహం గురించిన వార్తలు గత కొన్నాళ్లుగా విశేషంగా వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అమ్మడు త్వరలో పెళ్లి చేసుకోనుందనీ, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనీ ... ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఈ ముద్దుగుమ్మ బాయ్ ఫ్రెండుతో అతి సన్నిహితంగా వున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేయడం సంచలమైంది. ఈ నేపథ్యంలో అమ్మడు పెళ్లి గురించి తాజాగా స్పందించింది. 'ఇంట్లో వాళ్లు చూసిన సంబంధమైనా చేసుకోవచ్చు ... లేదా ప్రేమించిన వ్యక్తినైనా చేసుకోవచ్చు. దేనికైనా సమయం మాత్రం రావాలి' అంటూ అనుష్క చెప్పడంతో, ఈ చిన్నది ప్రేమలో పడిన మాట వాస్తవమేనన్న వార్తలు ఇప్పుడు ఊపందుకున్నాయి. అయితే, ఆ కుర్రాడు ఎవరన్నది మాత్రం తెలియాల్సివుంది!

,  ,  ,  ,  ,