Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2017 13:35:34
facebook Twitter Googleplus
Photo

అసలు అప్పటివరకు కేవలం బికినీ టైపు డ్రస్సుల్లో విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేయడం తప్పించి నటనపరంగా మార్కులు వేయించుకోని అనుష్క శెట్టి.. ఒక్కసారిగా అరుంధతి సినిమాతో తన స్టయిల్ మార్చేసింది. యాక్టింగ్ పరంగా పరిణితి చూపించింది. అప్పటినుండి నటనకు స్కోప్ ఉన్న అనేక పాత్రలను చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈమె ఒక సినిమాను వదులుకోవడం హాట్ టాపిక్ అయిపోయింది.

నిజానికి మిల్కీ బ్యూటి తమన్నా భాటియాను ఎప్రోచ్ అవ్వడానికి ముందే.క్వీన్ సినిమా రీమేక్ లో మెయిన్ లీడ్ గా చేయడానికి అనుష్కను అడిగారట. ఎందుకంటే అనుష్క అయితే సౌత్ లో ఉన్న అన్ని లాంగ్వేజస్ లోనూ మాంచి హోమ్లీ ఎపీల్ ఉంటుంది కాబట్టి. కాని ఆమె నో చెప్పడంతో.. గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ అయిన తమన్నా తలుపు తట్టారు. చివరకు ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువగా అడగటంతో కాజల్ దగ్గరకు వెళ్ళారు. అసలు అనుష్క ఎందుకు నో చెప్పింది. అనవసరంగా ఈ పాత్రను చేయడం వలన.. ఇప్పుడు కంగన ఎలా చేసింది నేను ఎలా చేశాను అనే కంపారిజన్ వస్తుంది. దాని వలన లేనిపోయిన క్రిటిసిజం అంతా భరించాలి. నాకెందుకు ఈ గోల? అని అనుష్క చెప్పిందట. అందుకే జేజెమ్మ క్వీన్ గా కనిపించే అవకాశం లేకపోయింది.

చూస్తుంటే మహేష్ బాబు చెప్పినట్లు.. ఆల్రెడీ ఒకరు చేసేసిన క్యారక్టర్ మనమేం చేస్తామండీ బాబు అని మనోడు ఎలాగైతే రీమేకులు చేయడో.. అనుష్క కూడా ఇప్పుడు అదే రూట్లో వెళ్తున్నట్లుంది.

,  ,  ,  ,  ,