Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Sep-2015 15:17:33
facebook Twitter Googleplus
Photo

సాగరకన్య శిల్పా శెట్టి స్లిమ్ అండ్ సెక్సీ బాడీతో బాలీవుడ్ ని ఏలింది. దాదాపు 40 టచ్ చేశాక కూడా శిల్పా ఇంకా ఆ ఒంపుసొంపులను నాజూగ్గానే మెయింటెయిన్ చేస్తోంది. మ్యారీడ్ ఉమెన్ అయినా రూపురేఖలు ఎక్కడా చెక్కు చెదరనేలేదు. అందుకే సాటి మగువలందరికీ ఈవిడ ఇన్ స్పిరేషన్. అయితే ఇదంతా ఎలా సాధ్యమైంది? నిరంతరం క్రమం తప్పకుండా యోగసాధన చేయడం ఆరోగ్య నియమాలు పాటించడం వల్లే ఇది సాధ్యమైంది.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా శిల్పా ఓ యోగా గురువుగా పరిచయం అయిపోయింది. సినిమాల నుంచి దూరమైనా ఈ భామ తెలివిగా యోగా సీడీల్ని మార్కెట్ లోకి తెచ్చింది. ఈ సీడీల్లో శిల్పా యోగాసనాలు మార్కెట్ లో పెను సంచలనం సృష్టించాయి. యూత్ ని విపరీతంగా ఆకర్షించాయి. శిల్పా శెట్టి తరహాలోనే బాలీవుడ్ లో మరికొందరు నాయికలు ఇలాంటి ఫీట్స్ వేశారు. ఇప్పుడు అదే బాటలో టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి కూడా తన వద్ద ఉన్న స్కిల్ ని మార్కెట్ చేసుకునేందుకు కొత్త వ్యూహం రచిస్తోంది.

అసలు అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా గురువు. సెలబ్రిటీలకు యోగా నేర్పించే టీచర్ గానే పరిచయం అయ్యింది. నాగార్జున నాగచైతన్య సహా పలువురు సెలబ్రిటీలు (పొలిటీషియన్స్ ఇండస్ర్టియలిస్ట్స్) స్వీటీ వద్ద యోగా పాఠాల కోసం విచ్చేసేవారు. భరత్ ఠాకూర్ భూమికా చావ్లా తర్వాత అంతటి గురువుగానూ స్వీటీ గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఇప్పుడు ఆ క్రేజు నంతటినీ క్యాష్ చేసుకునేందుకు స్వీటీ రెడీ అవుతోంది. ఎనీ వే.. ఆల్ ది బెస్ట్ టు అనుష్క. స్వీటీ నటించిన సైజ్ జీరో రుద్రమదేవి 3డి త్వరలోనే రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,