Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 14:17:37
facebook Twitter Googleplus
Photo

నటనలో తన వైవిధ్యాన్ని చూపుతూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర్ర వేసే నటుడు కమల్ హాసన్. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తండ్రి కి తగ్గ తనయురాలిగా పేరుతెచ్చుకుంది శ్రుతిహాసన్. వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. నిజ జీవితంలో తండ్రికూతుళ్ళైన వీరిద్దరూ కూడా కలిసి చేయబోయే సినిమాలో కూడా తండ్రి కూతుళ్ళు గా నటించడం విశేషం.
మేం ముందుగా చెప్పినట్టు ఈ సినిమా వినోదాత్మకంగా కాక సీరియస్ గా సాగుతుందని తెలిసింది. ఈ సినిమా దాదాపు అంతా అమెరికాలోనే చిత్రీకరణ ఉంటుందని సమాచారం. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తుండగా టికె రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి మిగతా విషయాలు త్వరలో తెలుస్తాయి.

,  ,  ,  ,  ,  ,