Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jul-2015 16:13:16
facebook Twitter Googleplus
Photo

సినిమా తారలు ప్రేమలో పడడం ... కొన్నాళ్లకు ఆ ప్రేమలు బ్రేకప్ కావడం మనం చూస్తూనే వున్నాం. సౌత్ కంటే కూడా ఇలాంటి బ్రేకప్స్ బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొంది, ఆ వెంటనే బాలీవుడ్ కి చెక్కేసిన మల్లూ బేబీ అసిన్ ప్రేమ కూడా ఇప్పుడు ఇలాగే బ్రేకప్ అయినట్టు వార్తలొస్తున్నాయి. గతంలో కొన్నాళ్లు బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్ తో స్నేహం చేసిన అసిన్, గత రెండేళ్ల నుంచి పారిశ్రామికవేత్త, మైక్రోమేక్స్ అధినేత రకుల్ శర్మతో ప్రేమాయణం సాగిస్తోంది. ఇద్దరూ ఇక పెళ్లి కూడా చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా వీరి ప్రేమకు ఫుల్ స్టాప్ పడినట్టు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ బ్రేకప్ కి సరైన కారణం మాత్రం తెలియరాలేదు.

,  ,  ,