Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Mar-2017 15:38:27
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు సినిమా కంటెంట్ అండ్ టైటిల్స్ తోనే రచ్చ లేపుతున్నారు అనుకుంటే.. ఆ టైటిల్స్ తాలూకు రచ్చలో సెన్సార్ బోర్డు కూడా మాంచి పాత్రనే పోషిస్తోంది. పైగా ఒక్కోసారి వీరి అతి పరాకాష్టకు చేరుకుని.. అసలు ఏం సెన్సార్ చేస్తున్నారో కూడా తెలియని రేంజులోకి వెళిపోతోంది. ఇదిగో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూసుకోండి మరి.

గంగపుత్రులు. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ.. వంటి సినిమాలను తీసిన అవార్డ్ విన్నింగ్ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఎటియం నాట్ వర్కింగ్ అనే కొత్త సినిమాతో వస్తున్నాడు. ఆ పోస్టర్లను చూస్తుంటేనే.. అప్పట్లో ఫిలిం నగర్లో కొన్ని పనిచేయని ఎటియంలలో సెక్యురిటీ గార్డులు అరగంటకు 200 రూపాయలు చొప్పున కపుల్స్ రొమాన్స్ చేసుకోవడానికి అద్దెకిచ్చిన న్యూస్ గుర్తొస్తోంది. ఇప్పటికే వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగులు సోషల్ నెట్వర్క్ మరియు వాట్సాప్ లో తిరుగుతూనే ఉంటాయి. అయితే ఇదంతా పక్కనెట్టేసి.. ఇప్పుడు ఎటియం నాట్ వర్కింగ్ అంటే అది ప్రభుత్వం పనితీరును ప్రశ్నించే విధంగా ఉంది కాబట్టి.. ఈ సినిమా పేరును ఎటియం వర్కింగ్ అని మార్చమని సెన్సార్ బోర్డు పట్టుబడట్టడంతో.. ఇప్పుడు సినిమా పేరులో నాట్ అనే అక్షరాలను క్రియేటివ్ గా కొట్టేశారు.

నిజానికి చూసుకుంటే.. డిమానిటైజేషన్ తరువాత ఇప్పటికీ చాలా ఎటియం లు పనిచేయట్లేదు.. అదే విధంగా అవి పనిచేసినా వాటిలో డబ్బులు రావట్లేదు

,  ,  ,  ,  ,  ,