Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2017 12:42:04
facebook Twitter Googleplus
Photo

మొత్తానికి బాహుబలి: ది కంక్లూజన్ రిలీజ్ సన్నాహాలు అనుకున్నట్లుగానే సాగిపోతున్నాయి. విడుదలకు పది రోజుల ముందు కూడా బాహుబలి బృందం రేయింబవళ్లు కష్టపడితే తప్ప సినిమా అనుకున్నట్లుగా విడుదలకు సిద్ధం కాలేదు. మూడు రోజుల కిందటే ఈ సినిమా పని నూటికి నూరు శాతం పూర్తి చేశారు. సెన్సార్ కూడా సవ్యంగా సాగిపోయింది. సెన్సార్ అయ్యాక కూడా కొన్ని మిక్సింగ్ పనులు అవీ కొనసాగడం విశేషం. ఐతే ఎట్టకేలకు శుక్రవారం నాడు బాహుబలి: ది కంక్లూజన్ కు సంబంధించి ఏ పెండింగ్ లేకుండా పని పూర్తయింది. ఫైనల్ కాపీ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి డెలివరీ కూడా ఇచ్చేశారు.

ఈ సందర్భంగా బాహుబలి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.. సినిమా కోసం చివరి నిమిషం దాకా కష్టపడ్డ యూనిట్ సభ్యులతో కలిసి సెల్ఫీ దిగి తన ఆనందాన్ని పంచుకున్నాడు. బాహుబలి-2 ఫైనల్ కాపీ డెలివరీ అయిపోయిందని.. ఇక సినిమా థియేటర్లలోకి దిగడమే తరువాయి అన్న రిలీఫ్ తో కనిపించాడు. గత కొన్ని నెలలుగా రిలీజ్ డేట్ ను అందుకుంటామో లేదో అని బాహుబలి టీం చాలా టెన్షనే అనుభవించింది. గత కొన్ని నెలలుగా వందల మంది రేయింబవళ్లు పని చేస్తే తప్ప పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదు. ఈ పనిలో పడి ప్రమోషన్ కూడా అనుకున్నట్లుగా చేయలేకపోయింది బాహుబలి టీం. ఇకపై మిగిలిన ఐదారు రోజుల్లో కూడా విడుదలకు ఏర్పాట్లు చూసుకోవాలి.

,  ,  ,  ,  ,  ,