Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2016 13:08:01
facebook Twitter Googleplus
Photo

తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశంలో అన్ని భాషల వాళ్లూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ?బాహుబలి: ది కంక్లూజన్?. దీని షూటింగ్ విశేషాలు తెలుసుకోవడానికి కూడా అందరూ చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. బాహుబలి టీమ్ కూడా షూటింగుకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇవాళ బాహుబలి-2 క్లైమాక్స్ మొదలవుతుందని.. 70 రోజుల పాటు నిర్విరామంగా క్లైమాక్స్ చిత్రీకరణ సాగుతుందని ఇంతకుముందే నిర్మాత శోభు యార్లగడ్డ ప్రకటించిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్ పార్ట్ కోసం పని చేసే హాలీవుడ్ నిపుణుల వివరాలు కూడా వెల్లడించాడాయన. తాజాగా ఈ రోజు ఉదయం షూటింగ్ సన్నాహాలకు సంబంధించిన ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

తెల్లవారుజామున నుంచి రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి-2 క్లైమాక్స్ చిత్రీకరణకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆరున్నర ప్రాంతంలో రాజమౌళి.. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ - ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్.. లైన్ ప్రొడ్యూసర్ వల్లి సహా టెక్నికల్ టీం మొత్తాన్ని కూర్చోబెట్టుకుని షూటింగుకి సంబంధించి బ్రీఫింగ్ ఇచ్చాడు. అనంతరం హాలీవుడ్ నిపుణుల టీంతో డిస్కషన్స్ పెట్టాడు. వీటికి సంబంధించిన ఫొటోల్ని శోభు షేర్ చేశాడు. హీరో ప్రభాస్.. విలన్ రానా దగ్గుబాటిలతో సెల్ఫీలు కూడా దిగి.. వాటిని కూడా పోస్ట్ చేశాడు శోభు. ప్రభాస్ చాలా గ్లామరస్ లుక్లో దర్శనమిచ్చాడు ఈ సెల్ఫీలో. రానా గుబురు గడ్డం పెంచి.. త్రీబైఫోర్త్ వేసుకుని కనిపించాడు. ఇవాళ షూటింగుకి సంబంధించి కూడా సాయంత్రానికి ఏవైనా అప్ డేట్స్ ఇస్తాడేమో చూడాలి శోభు.

,  ,  ,  ,  ,