Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2017 11:38:54
facebook Twitter Googleplus
Photo

ఒక తెలుగు సినిమా ఓవరాల్ కలెక్షన్లు రూ.50 కోట్లు వస్తే పెద్ద హిట్టుగా చెప్పుకునే రోజుల్లోనే ఉన్నామింకా. అలాంటిది ఒక్క ఏరియాలోనే ఓ సినిమా రూ.50 కోట్ల షేర్ సాధించడమంటే మామూలు విషయం కాదు. బాహుబలి: ది కంక్లూజన్ ఈ అద్భుత ఘనతే సాధించింది. నైజాం ఏరియాలో కనీ వినీ ఎరుగని రీతిలో రూ.50 కోట్ల షేర్ మార్కుకు అత్యంత చేరువగా వచ్చిందీ సినిమా.

11 రోజులకి నలభై ఏడు కోట్లకి పైగా షేర్ సాధించిన బాహుబలి-2 మంగళ వారం లేదా బుధవారం రూ.50 కోట్ల షేర్ మార్కును అధిగమిస్తుందని భావిస్తున్నారు.నాన్-బాహుబలి సినిమాల్లో ఏవీ కూడా ఇప్పటిదాకా నైజాం ఏరియాలో పాతిక కోట్ల షేర్ మార్కును కూడా అందుకోలేదు. అలాంటిది ఈ సినిమా రూ.50 కోట్ల షేర్ సాధించడం అంటే అసాధారణ విషయం. బాహుబలి: ది బిగినింగ్ సాధించిన రూ.44 కోట్ల షేర్ రికార్డుకే అబ్బుర పడితే.. ఇప్పుడు ది కంక్లూజన్ ఏకంగా రూ.60 కోట్ల మార్కును అందుకునేలా కనిపిస్తోంది.

ఈ సినిమా హక్కుల్ని రూ.40 కోట్లకు అమ్మబోతే కొనడానికి చాలామంది సందేహించారు. ఫస్ట్ పార్ట్ ను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు కూడా వెనుకంజ వేశాడు. దీంతో నిర్మాతలు అడ్వాన్స్ పద్ధతిలో హక్కులు అమ్మారు. వాళ్లు రైట్స్ ఔట్ రేట్ గా అమ్మినట్లయితే రూ.40 కోట్లు మాత్రమే వచ్చి వుండేవి

,  ,  ,  ,  ,