Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Mar-2017 10:36:44
facebook Twitter Googleplus
Photo

మోస్ట్ ఎవైటింగ్ మూవీ బాహుబలి 2 విషయంలో కన్నడిగుల తీరు మరోలా ఉందంటున్నారు. మిగిలిన వారికి భిన్నంగా బాహుబలి2 విడుదల విషయంలో కన్నడిగుల్లో ప్రత్యేక వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో కట్టప్ప పాత్ర పోషించిన సత్యారాజ్ కారణంగానే.. బాహుబలి సినిమా విడుదలను తాము అడ్డుకుంటామంటూ గళం విప్పారు కన్నడ సంఘాలు. తాజాగా బెంగళూరులోని ఫిలిం ఛాంబర్ వద్ద కన్నడ సంఘాలు ధర్నాకు దిగాయి.

ఈ సినిమాలో కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ గతంలో కావేరీ జలాల విడుదల సమయంలో చేసిన వ్యాఖ్యల్ని తెర మీదకు తీసుకొచ్చిన కన్నడ సంఘాలు.. ఆయన సారీ చెబితేనే కానీ బాహుబలి 2 సినిమా విడుదలకు ఓకే అంటామని తేల్చి చెబుతున్నారు. కట్టప్పను.. ఓ కెట్టప్ప చెడ్డవాడన్నది కన్నడంలో అర్థం) నీ సినిమా మాకొద్దప్పా అంటూ వారు విరుచుకుపడుతున్నారు.

కావేరీ జలాల విడుదల సమయంలో కన్నడిగుల్ని అవహేళన చేసేలా సత్యరాజ్ వ్యాఖ్యలు చేశారని.. ఆయన భేషరతుగా క్షమాపణలు చెబితే తప్ప ఊరుకునేది లేదన్నారు. లేనిపక్షంలో సినిమా విడుదలను అడ్డుకుంటామన్న మాటను చెబుతున్నారు కర్ణాటక రక్షణ వేదిక నేత ప్రవీణ్ శెట్టి. ఆయన మాటకు ఫిలిం చాంబర్ అధ్యక్షు సారా గోవిందు సైతం వంత పాడటం విశేషం.

తమిళనాడులో చోటు చేసుకున్న తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో కావేరీ జలాల్ని విడుదల చేయాలని తమిళనాడు కోరటం.. అందుకు కన్నడిగులుససేమిరా అనటం.. ఈ ఉదంతంలో రెండు రాష్ట్రాల్లో కలకలం చెలరేగటమే కాదు.. ప్రశాంతంగా ఉండే కర్ణాటక ఒక్కసారి భగ్గుమనటం తెలిసిందే. ఈ సందర్భంగా కావేరీ నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేసిన వారిలో తమిళనటుడు సత్యరాజ్ కూడా ఉన్నారు. కావేరీ ఎపిసోడ్ సమయంలో కన్నడిగుల్ని అవహేళన చేసేలా సత్యరాజ్ మాట్లాడారని.. ఆయన సారీ చెబితేనే బాహుబలి 2 విడుదల గురించి ఆలోచిస్తామంటున్నారు. దానిదేముంది.. సారీ చెప్పించ్చొని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే సత్యరాజ్ నోటి నుంచి సారీ అన్న మాట వస్తే..తమిళులు హర్ట్ కావటం ఖాయం.

,  ,  ,  ,  ,  ,