Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-May-2017 11:13:42
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్ వసూళ్ల మోత మామూలుగా లేదు. ఈ సినిమా ఇండియాలో కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందన్నది ముందే అంచనా వేసిన విషయమే కానీ.. మరీ ఈ స్థాయిలో ప్రభంజనం సాగిస్తుందని అనుకోలేదు. అమెరికాలో 15 మిలియన్ డాలర్లు రికవర్ చేయాల్సిన బాహుబలి-2 ఆ మార్కును అందుకోగలదా అని చాలామంది సందేహించారు. స్వయంగా డిస్ట్రిబ్యూషన్ సంస్థే.. ఫస్ట్ పార్ట్ లాగా దీనికి పెద్దగా లాభాలు ఆశించలేమేమో అని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఫస్ట్ వీకెండ్లో ఈ చిత్రం సాధించిన వసూళ్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. తొలి వారాంతం పూర్తి కాకముందే ఈ చిత్రం 10 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడం విశేషం.

గురువారం ప్రిమియర్లతో కలిపి తొలి రోజుకే 4.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసిన బాహుబలి-2.. శనివారం కూడా అదే జోరు కొనసాగించింది. రెండు రోజుల్లోనే 8.1 మిలియన్ డాలర్లకు బాహుబలి-2 వసూళ్లు చేరుకున్నాయి. ఆదివారం షోలన్నీ అయ్యేసరికి 10 మిలియన్ మార్కును అలవోకగా దాటేసిందీ చిత్రం. ఫైనల్ ఫిగర్స్ పై ఇంకా సమాచారం రావాల్సి ఉంది కానీ.. 10 మిలియన్ మార్కునైతే అందుకున్న సంగతి వాస్తవం. మరోవైపు తొలి వీకెండ్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశాలున్నాయిన ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఇంకా ఇండియాలోని అన్ని ప్రాంతాల కలెక్షన్లపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. వరల్డ్ వైడ్ కలెక్షన్ల మీద ఐడియా రావడానికి టైం పట్టొచ్చు

,  ,  ,  ,  ,