Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-May-2015 11:21:36
facebook Twitter Googleplus
Photo

ఎన్నో ప్రత్యేకతలు .. మరెన్నో విశేషాలతో బాహుబలి సినిమా రూపొందింది. ఒక్కొక్కటిగా విడుదల చేస్తోన్న పోస్టర్లు అంచనాలను పెంచుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 31న ఈ సినిమా ఆడియో లాంచ్ కి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఖర్చుతో ఈ ఆడియో వేడుకను నిర్వహించనున్నట్టు చెప్పుకుంటున్నారు. పరాక్రమం .. ప్రేమానురాగాలు పెనవేసుకుని కనిపించే ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించాడు. జానపద చిత్రాలలో సహజంగానే మెలోడీ గీతాలకి ప్రాధాన్యతను ఇస్తుంటారు. అలాంటి తేనె పాటలను అందించడంలో కీరవాణి సిద్ధహస్తుడు.

ఈ సినిమాపై గల అంచనాలను దృష్టిలో పెట్టుకుని, ప్రముఖ ఆడియో సంస్థలు రైట్స్ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఆడియో వేడుకకి కోలీవుడ్ నుంచి రజనీకాంత్ .. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ హాజరవుతున్నట్టు సమాచారం. ఇక రాజమౌళి సినిమాలలో నటించిన కథానాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. అందరి సమక్షంలో ఈ సినిమా పాటలను ... ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. రాజమౌళి ఈ కార్యక్రమాన్ని ఎంత కొత్తగా డిజైన్ చేశాడో చూడాలనే ఆతృత అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

,  ,  ,  ,  ,