Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Feb-2017 10:15:54
facebook Twitter Googleplus
Photo

నిన్నటి నుండి నేషనల్ మీడియాలో పేలిపోతున్న ఒక న్యూస్ ఏంటంటే.. బాహుబలి 2 సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కనిపించనున్నాడని. మొన్నామధ్యన రయీస్ సినిమా ప్రమోషన్లలో బాహుబలి సినిమా గురించి షారూఖ్ మాట్లాడినప్పటి నుండి ఈ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇదే విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా. అయితే ఈ మొత్తం యవ్వారంపై బాహుబలి టీమ్ భలే క్లారిటీ ఇచ్చేసిందిలే.

''షారూఖ్ ఖాన్ మా సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేస్తానంటే కాదంటామా? అంతకంటే అదృష్టమా? కాని నిజానికి ఇది ఒక రూమర్ మాత్రమే'' అంటూ రూమర్లపై ఎప్పుడూ క్లారిటీ ఇవ్వడంలో ముందుండే బాహుబలి టీమ్ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. అంటే షారూఖ్ ఖాన్ అక్కడ కరణ్ జోహార్ కు ఎంత క్లోజ్ అయినప్పటికీ.. ఈ సినిమాలో మాత్రం మెరవట్లేదన్నమాట. అయితే ఎప్పుడూ సౌత్ హీరోల పేర్లు మాత్రమే ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వినిపించేది. కొన్నిసార్లు రజనీకాంత్.. కొన్నిసార్లు సూర్య.. అలా అలా వినిపించాయి. బహుశా ఆ హీరోలు బాహుబలి సినిమాను పొగడటం వలనే ఇలా వారి పేర్లు రెండో భాగంతో లింకప్ అయిపోతున్నాయిలే.

ఇపోతే బాహుబలి 2 సినిమాను ఏప్రియల్ 28న రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాడు రాజమౌళి. బహుశా వచ్చే నెలలో ప్రమోషన్లు మొదలుపెడతాడేమో చూడాలి.

,  ,  ,  ,  ,