Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2017 15:38:30
facebook Twitter Googleplus
Photo

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. బాహుబలి ని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగానూ వాడేస్తున్నారు. బాహుబలి సినిమా పరిధిని ఎప్పుడో దాటిపోయింది. అనేక రంగాలకు దీని ప్రభ విస్తరించింది. రాజకీయాల్లో సైతం బాహుబలి ప్రస్తావన రావడం.. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే బాహుబలి ప్రస్తావన తేవడం తెలిసిన సంగతే. ఇక వ్యాపార రంగంలోనూ బాహుబలి వాడకం మామూలుగా లేదు. బాహుబలిని బేస్ చేసుకుని ఈ మధ్య కాలంలో ఎన్నెన్నో ప్రకటనలు వచ్చాయి. బాహుబలిలో శివగామి పాత్ర ఆధారంగా రమ్యకృష్ణతో ఓ పత్తి విత్తనాల సంస్థ చేసిన స్పెషల్ యాడ్ ను ఇప్పటికే గమనించి ఉంటారు.

తాజాగా బట్టల వ్యాపారానికి పెట్టింది పేరైన సూరత్ లో ఓ చీరల తయారీ సంస్థ బాహుబలి ని ఫుల్లుగా వాడేసుకుంది. బాహుబలి స్పెషల్ చీరల్ని ఆ సంస్థ తయారు చేసింది. చీర కొంగు మీద ప్రభాస్-అనుష్క కలిసి బాణాలు విసిరే దృశ్యాన్ని ప్రింట్ చేసి ఈ స్పెషల్ చీరల్ని తయారు చేశారు. సూరత్ నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాలకు ఈ చీరల్ని పంపించారు. ప్రస్తుతం పెద్ద షోరూంలలో బాహుబలి చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి మహిళల దృష్టిని బాగానే ఆకర్షిస్తున్నాయి. మార్కెట్ లో డిమాండ్ ను బట్టి మరిన్ని బాహుబలి చీరల్ని తయారు చేయించాలని తయారీ దారు భావిస్తున్నాడు

,  ,  ,  ,