Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Mar-2017 15:41:46
facebook Twitter Googleplus
Photo

వేలాది మంది ప్రజలు. ఫంక్షన్ కీలకంగా ఉన్న వేళలో.. అప్పటికే ఆలస్యమైందన్న హడావుడిలో.. అదరాబాదరాగా కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసే వేళలో సెల్ఫీ అంటే..? చిరాకే. అందులోకి ఒకరో.. ఇద్దరో కాదు.. ఏకంగా ఓ పెద్ద సమూహాన్ని బుజ్జి సెల్ఫీలో బంధించటం అంటే సిన్న కత కాదు. కానీ.. అంత హడావుడిలోనూ అదిరిపోయేలా తీసిన సెల్ఫీ ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

సెల్ఫీ అంటే ముఖాలు సరిగా రాకుండా ఉండటం.. వచ్చినా.. లైటింగ్ డల్ గా ఉండటమో.. ముఖాలు సరిగా రాకపోవటమో లాంటివి కామన్. కానీ.. అందుకు భిన్నంగా. పర్ ఫెక్ట్ షాట్ అన్న రీతిలో తీసిన బాహుబలి టీం సెల్ఫీ ఇప్పుడు అదరగొట్టేస్తోంది.

బాహుబలి 2 కన్ క్లూజన్ మూవీ ప్రిరిలీజ్ ఫంక్షన్ చివర్లో అందరూ ఎవరి దారిన వారు వెళుతున్న వేళ.. కెప్టెన్ ఆఫ్ ద షిప్ రాజమౌళి నోటి నుంచి సెల్ఫీ అన్న మాట వచ్చింది. అంతే.. అప్పటికప్పుడు ఎవరికి వారు.. రెఢీ అయిపోయారు. దగ్గరగా నిలుచోడంటూ అన్న మాటలు వినిపిస్తున్న వేళ.. ఎవరికి వారు సర్దుకుంటూ నిలబడుతున్నారు. అంతలోనే.. నిర్మాత శోభు.. దర్శకుడు రాజమౌళి అయితే.. ఏకంగా ఒంగిపోయి.. దాదాపు మోకాళ్ల మీద నిలబడిపోయిన పరిస్థితి. అలాంటి వేళ.. సెల్పీ తీశారు. పందొమ్మిది మందితో తీసిన సెల్ఫీ ఎలా వచ్చిందన్న ఉత్సుకతకు తెర దించారు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్. తన ట్విట్టర్ అకౌంట్లో బాహుబలి 2 ఫైనల్ సెల్ఫీని పోస్ట్ చేశారు. ఎవరి తలలు కట్ కాకుండా.. అందరూ ఫోటోల ఉండేలా ఉన్న సెల్ఫీని చూసిన చాలామంది వావ్.. భలే తీశారేనన్న మాట అప్రయత్నంగా వచ్చే పరిస్థితి. ఇంతకీ.. అంత హడావుడిలో.. ఇంత అద్భుతమైన సెల్ఫీని తీసిందెవరన్నది చూస్తే.. బాహుబలికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించిన సెంథిల్ స్వయంగా తన ఫోన్లో ఈ సెల్ఫీ తీశారు.

,  ,  ,  ,  ,  ,