Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2016 12:01:03
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్, ?భలే భలే మగాడివోయ్‌?తో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతిల కాంబినేషన్‌లో ?బాబు బంగారం? అనే సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. టీజర్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆగష్టు 12న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ నెల 24న హైద్రాబాద్‌లో పెద్ద ఎత్తున జరగనున్న విషయం తెలిసిందే.
ఇక ఆడియో విడుదల కోసం వారం ముందు నుంచే ప్రమోషన్స్ చేపట్టాలన్న ఆలోచనతో రేపు బాబు బంగారం టీమ్, థీమ్ సాంగ్‌ను విడుదల చేయనుంది. హైద్రాబాద్‌లోని రేడియో మిర్చి ఎఫ్.ఎం. స్టేషన్‌లో ఈ థీమ్ సాంగ్ విడుదల కానుంది. గిబ్రాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. వెంకటేష్ ఈ సినిమాలో ఓ కామెడీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు.

,  ,  ,  ,  ,  ,