Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Feb-2017 16:25:56
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది బిగినింగ్ మీద తెలుగులో ఉన్నంత అంచనాలు వేరే భాషల్లో లేవు. అందులోనూ నార్త్ ఆడియన్స్ విడుదల సమయంలో ఈ సినిమా కోసం వేలం వెర్రిగా ఏమీ ఎగబడలేదు. అయినప్పటికీ ఆ చిత్రం రూ.200 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. విడుదల తర్వాత ఏకంగా రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. నేషనల్ వైడ్ అనేక రికార్డుల్ని బద్దలు కొట్టింది.

ఇక వర్తమానంలోకి వస్తే బాహుబలి: ది కంక్లూజన్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన ప్రేక్షకులు ఎంత ఉత్కంఠగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారో నార్త్ ఆడియన్స్ దీ అదే పరిస్థితి. ప్రేక్షకుల్లో అంతకంతకూ అంచనాలు పెరిగిపోతుండటంతో ఈ సినిమా బిజినెస్ అనూహ్యమైన స్థాయికి చేరేలా కనిపిస్తోంది. అలాగే వసూళ్లు కూడా కనీ వినీ ఎరుగని స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.

బాహుబలి: ది బిగినింగ్ సినిమాను హిందీలో రిలీజ్ చేసిన కరణ్ జోహార్.. హక్కుల కోసం నిర్మాతలకు ఇచ్చింది రూ.10 కోట్లేనని సమాచారం. ఆ సినిమా హిందీ వరకే వరల్డ్ వైడ్ రూ.150 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. ఇందులో సగం షేర్ వచ్చి ఉన్నా కరణ్ జోహార్ ఏ స్థాయిలో లాభపడ్డాడో అంచనా వేయొచ్చు. ఈ నేపథ్యంలోనే బాహుబలి: ది కంక్లూజన్ కోసం చాలా పెద్ద మొత్తంలోనే చెల్లించాడట కరణ్. ఆ మొత్తం రూ.120 కోట్లని సమాచారం. తొలి భాగంతో పోలిస్తే ఇది చాలా పెద్ద మొత్తంగా కనిపించొచ్చు కానీ.. బాహుబలి మీద ఉన్న అంచనాల ప్రకారం ఈ చిత్రం హిందీ వరకే కనీసం రూ.200 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టవచ్చని అంచనా.

ఆ మధ్య 2017లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఏవంటూ దేశవ్యాప్తంగా సర్వే చేస్తే దాదాపు 60 శాతం మంది

,  ,  ,  ,  ,  ,